అఖిల్ సినిమాతో మొదటి అడుగులోనే దెబ్బ తిన్న అఖిల్ రెండవ సినిమాతో కూడా మొదటి గాయాన్నిపూర్తిగా మాన్పించలేకపోయాడు. హలో సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుందే గాని కమర్షియల్ గా పెద్దగా లాభాలను ఇవ్వలేకపోయింది. ఇక ఇప్పుడు సక్సెస్ అందుకోవడానికి మిస్టర్ మజ్ను సినిమాతో రాబోతున్నాడు. 

గత సినిమాలకు ఈ సినిమాకు డిఫరెంట్ ఏమిటని వస్తున్న విమర్శలకు అఖిల్ మంచి ఫిజిక్ తో ఆన్సర్ ఇచ్చాడు. సిక్స్ ప్యాక్ తో ఫిట్ గా కనిపిస్తున్న అఖిల్ అందుకోసం మూడు నెలలు తీవ్రంగా కష్టపడినట్లు తెలిపాడు. ట్రైనర్ దిలీప్ కు కృతజ్ఞతలు చెబుతూ మిస్టర్ మజ్ను న్యూ లుక్ తో ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేశాడు. దీంతో అఖిల్ కేక అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. 

అంతే కాకుండా సినిమాకు సంబందించిన టైటిల్ ట్రాక్ ను రేపు సాయత్రం ఆరు గంటలకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న మిస్టర్ మజ్ను కి తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక కథానాయికగా నిధి అగర్వాల్ అఖిల్ సరసన నటించిన సంగతి తెలిసిందే. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.