Asianet News TeluguAsianet News Telugu

వారంలో ‘బ్యాచ్‌లర్‌’ కి 40 కోట్లు సరే, కానీ ఎనిమిదో రోజే?

దసరా కానుకగా విడుదలైన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” మంచి వసూళ్లు రాబడుతున్నాడు. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అక్టోబర్ 15 న గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, సినిమా ప్రియుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. 

Akhil Most Eligible Bachelor drop in 8 th day
Author
Hyderabad, First Published Oct 23, 2021, 4:47 PM IST

అఖిల్‌ అక్కినేని హీరోగా నటించిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. పూజా హెగ్డే హీరోయిన్.  బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలు. అల్లు అరవింద్‌ సమర్పించారు. ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చాలా కాలంగా సన్నాహాలు చేసి మొత్తానికి మొన్న రిలీజ్ చేసారు. టైమ్ లో ఓటీటికు ఈ సినిమా ఇచ్చేస్తున్నారని అనుకున్నారంతా.  ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ హక్కులు కొనుగోలు చేసిందని నెట్టింట్లో వరుస పోస్టులు దర్శనమిచ్చాయి. అయితే అన్నిటినీ దాటుకుని థియోటర్ లో రిలీజ్ చేసారు. సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఈ నేపధ్యంలో సినిమా కలెక్షన్స్ ఏంటో చూద్దాం.

నిర్మాతలు అఫీషియల్ గా ఎనౌన్స్ చేసిన దాని ప్రకారం... గత శుక్రవారం విడుదలైన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ తొలివారంలో ప్రపంచ వ్యాప్తంగా రూ. 40 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసిందని చిత్ర నిర్మాతలు తెలిపారు. మొదటి ఆట నుండే ఈ చిత్రానికి పాజిటివ్ బజ్ క్రియేట్ అవటం ప్లస్ అయ్యింది. దానికి తోడు అమెరికాలోనూ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అఖిల్ – ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తొలి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం కావడంతో పాటు  ఈ మూవీ ఓపెనింగ్స్ కు బాగా ఉపయోగపడింది. ముఖ్యంగా నైజాం, సీడెడ్ ఏరియాలో సినిమా బాగా ఆడుతోంది. ఆంధ్రాలో వంద శాతం ఆక్యుపెన్సీ కూడా డీసెంట్ కలెక్షన్స్ రావటానికి కలిసొచ్చింది. 

 ఈ సినిమా రూ. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో విడుదలైన బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లో అడుగు పెట్టింది. ఒక రకంగా బొమ్మరిల్లు భాస్కర్ తాను ఈ సినిమాతో హిట్టు అందుకోవడమే కాకుండా ఆరేళ్లుగా చకోర పక్షిలా హిట్ కోసం ఎదురు చూస్తోన్న అఖిల్‌కు హిట్ రుచి ఏంటో చూపించారు. మొత్తంగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా దర్శకుడికి, హీరోకు మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి.

అయితే ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిదో రోజు కలెక్షన్లు బాగా తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 7 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.10 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1.10 లక్షలు, కృష్ణాలో రూ. 2.40 లక్షలు, నెల్లూరులో రూ. 60 వేలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 19 లక్షలు షేర్, రూ. 32 లక్షలు గ్రాస్ వచ్చింది.

ఇక ప్రేమ, కుటుంబకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో అఖిల్‌ సరసన పూజాహెగ్డే నటించారు. యువతరానికి నచ్చే అంశాలు, కుటుంబ భావోద్వేగాల మేళవింపుగా ఈ చిత్రాన్ని రూపొందించారు. బ్యాచ్‌లర్‌గా అఖిల్‌ చేసే సందడి ఆకట్టుకుంటుంది. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.  ఆమని, మురళీశర్మ, జయప్రకాశ్, ప్రగతి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, ఛాయాగ్రహణం: ప్రదీశ్‌ ఎమ్‌.వర్మ. 
  

Follow Us:
Download App:
  • android
  • ios