బిగ్‌బాస్‌4 దసరా స్పెషల్‌ సమంత హోస్ట్ గా సాగుతుంది. దసరా స్పెషల్‌ చాలా స్పెషల్‌గా సాగుతుంది. పాటలు, ఆటలతో కొత్త ఊపు తీసుకొచ్చారు. మరోవైపు సర్‌ప్రైజింగ్‌ గెస్ట్ లతో సందడి మరింత పెంచారు బిగ్‌బాస్‌. 

ఇందులో `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` గేమ్‌ పెట్టారు. ఇందులో మూడు స్టెప్పులుంటాయని, అందులో గెలిచినవారు విన్నర్‌ అని చెప్పారు. నాలుగు జోడీగా విడగొట్టి వారితో డాన్స్ లు వేయించారు సమంత. అందులో బెస్ట్ జోడీని ఎంపిక చేయాల్సి ఉంది. అందులో సమంతతోపాటు అఖిల్‌ గెస్ట్ గా వచ్చారు. ఇందులో అవినాష్‌, హారిక జోడీగా స్టెప్పులేశారు. తమ ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్‌ ఉంటుందన్నారు. అఖిల్‌, మోనాల్‌ కలిసి స్టెప్పులేశారు. అఖిల్‌కి ఆ పేరు ఎలా వచ్చిందో హీరో అఖిల్‌ అడిగాడు. `సిసింద్రి` సినిమా టైమ్‌లో తాను పుట్టానని ఆ అభిమానంతో ఆ పేరు పెట్టారని అఖిల్‌ చెప్పాడు. 

ఆ తర్వాత అభిజిత్‌, దివి కలిసి డాన్స్ చేశారు. అభిజిత్‌ డాన్స్ పై సమంత సెటైర్‌ వేశారు. డాన్స్ లో తోపు అట అని పంచ్‌ పేల్చారు. ఈ డాన్స్ ని చూడా తమకి కూడా మైండ్‌ బ్లాంక్‌ అయ్యిందని అమ్మా రాజశేఖర్‌ బాంబ్‌ పేల్చారు. తక్కువ మాట్లాడటం వల్ల అభిజిత్‌ నచ్చుతాడని దివి చెప్పింది. ఇక అరియానా, మెహబూబ్‌ కలిసి స్టెప్పులేశారు. ఇద్దరు బాగా డాన్స్ చేసి మెప్పించారు. ఇద్దరం ఎప్పుడూ గొడపడతామని మెహబూబ్‌ చెప్పారు. కాంపిటేటివ్‌ స్పిరిట్‌ మెహబూబ్‌లో నచ్చుతుందని అరియానా చెప్పారు.  మొత్తంగా ఇందులో అఖిల్‌ విన్నర్‌ అని అఖిల్‌ చెప్పారు. 

ఇక ఆ తర్వాత దసరా స్పెషల్‌లో హాట్‌ హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ని దించారు. ఆమె ఘాటైన డాన్స్ లతో అదరగొట్టారు. మరోవైపు హీరో కార్తికేయ సైతం డాన్స్ తో ఎంట్రీ ఇచ్చారు. అలాగే పంచ్‌ల కింగ్‌ హైపర్‌ ఆది సైతం స్పెషల్‌ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చి పంచ్‌లతో సందడి చేశారు.