Asianet News TeluguAsianet News Telugu

#Agent:నాగ్ ‘ది ఘోస్ట్’కి అఖిల్ 'ఏజెంట్' కి పోలిక అదే...

 స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో రానున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.   భారీ బడ్జెట్‌తో రానున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. 

Akhil is coming up with Agent which again belongs to The Ghost genre
Author
First Published Oct 8, 2022, 6:22 PM IST


కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం ‘ది ఘోస్ట్’. స్పై నేపథ్యంలో గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ దసరా కానుకగా మొన్న బుధవారం రోజు  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి బరిలో నాగ చైతన్య తో కలిసి ‘బంగార్రాజు’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న నాగ్..ఇప్పుడు ‘ది ఘోస్ట్’ సినిమాతో వచ్చి  డివైడ్ టాక్ సొంతం చేసుకున్నాడు.   యాక్షన్ సీక్వెన్స్‌లు పెద్దగా ఎవరికీ పట్టలేదు. నాగార్జున తన స్వాగ్‌తో వన్ మ్యాన్ షో చేశారని అభిమానులు మురిసిపోయారు కానీ ఫలితం లేకుండా పోయింది.  ఓవరాల్ గా ఘోస్ట్ మూవీ కి ఫ్లాఫ్  అనిపించుకుంది. ఈ నేపధ్యంలో నాగార్జున రెండో కుమారుడు అఖిల్ చేస్తున్న సినిమా ఏజెంట్ పై అందరి దృష్టీ పడింది.

ఏజెంట్ చిత్రం సైతం స్పై జానర్ లో నడుస్తుంది. స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో రానున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.   భారీ బడ్జెట్‌తో రానున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఏజెంట్‌గా టైటిల్ రోల్ పోషిస్తోన్న అఖిల్.. ఎంతో స్టైలీష్‌గా కనిపించనున్నాడు. 

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో అఖిల్ ప్రేమికురాలిగా సాక్షి వైద్య నటిస్తోంది. ఈ సినిమాతోనే ఈ బ్యూటీ అరంగేట్రం చేయనుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు.

ఇందులో అఖిల్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడు. దానికి తగ్గట్లే కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. అంతా బాగానే ఉంది కానీ స్పై జానర్ లో నాగార్జున ఫెయిల్ అవ్వటంతో ....అఖిల్ సినిమా పై ఆ ఇంపాక్ట్ పడతుందా అనే చర్చలు సోషల్ మీడియాలో  మొదలయ్యాయి. అయితే ఆ సినిమా వేరు..ఈ సినిమా కథ వేరు. హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై మంటి అంచనాలే ఉన్నాయి.  

ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ స్పై థ్రిల్ల‌ర్‌లో అఖిల్ జోడీగా సాక్షి వైద్య న‌టిస్తుంది. ఈ సినిమా మలయాళ నటుడు మమ్ముట్టి కీలకపాత్ర పోషిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీతం అందించగా, రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహకుడిగా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios