అక్కినేని ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ క్రేజీ హీరోగా చెప్పబడుతున్న అఖిల్ అక్కినేని ప్రస్తుతం ఏజెంట్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. అఖిల్ కేవలం హీరో మాత్రమే కాదు.. మల్టీట్యాలెంటెడ్. అఖిల్ కి క్రికెట్ లో మంచి నైపుణ్యం ఉంది.
అక్కినేని ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ క్రేజీ హీరోగా చెప్పబడుతున్న అఖిల్ అక్కినేని ప్రస్తుతం ఏజెంట్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. అఖిల్ కేవలం హీరో మాత్రమే కాదు.. మల్టీట్యాలెంటెడ్. అఖిల్ కి క్రికెట్ లో మంచి నైపుణ్యం ఉంది. ఒక దశలో అఖిల్ జోరు చూసి ఇతడు క్రికెటర్ అవుతాడేమో అని అంతా అనుకున్నారు.
కానీ నాగార్జున చివరకి అఖిల్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు. సినీతారల క్రికెట్ మ్యాచ్ లు జరిగినప్పుడు అఖిల్ ఎలా చెలరేగుతాడో అందరికి తెలిసిందే. ప్రస్తుతం సిసిఎల్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. రాయ్ పూర్ లో నిన్న తెలుగు వారియర్స్, కేరళ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అఖిల్ బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 30 బంతుల్లోనే 91 పరుగులు సాధించి తన జట్టుని గెలిపించాడు.
ఈ మ్యాచ్ లో అఖిల్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయాన్ని అఖిల్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. కానీ అఖిల్ చేసిన ఒక కామెంట్ అందరి హృదయాలు గెలుచుకునేలా ఉంది.
'మేము వైల్డ్ గా ప్రారంభించాం. నాకు ఇష్టమైన వ్యక్తులతో కలసి మ్యాచ్ ఆడటం సంతోషాన్ని ఇచ్చింది. మరోసారి ఇంటికి ట్రోఫీ తీసుకుని వద్దాం. ఈ సందర్భంగా ఈ విజయాన్ని నేను నా మాజీ టీం మేట్ తారకరత్న గారికి అంకితం ఇస్తున్నా. ఈ రోజు మాతో ఆయన ఇక్కడ ఉండి ఉంటే బావుండేది అని అఖిల్ ట్వీట్ చేశాడు.

తారకరత్నకి అఖిల్ ఈ విజయాన్ని అంకితం ఇవ్వడంతో అభిమానులంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనితో అఖిల్ పై మరింతగా గౌరవం పెరుగుతోంది అని కామెంట్స్ చేస్తున్నారు. నందమూరి తారకరత్న 23 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ శనివారం శివరాత్రి రోజు తుదిశ్వాస విడిచారు. నందమూరి కుటుంబం, అభిమానులు విషాదంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే.
