బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ఫైనలిస్ట్ ఎవరో తెలిసిపోయింది. మొత్తానికి ఉత్కంఠత మధ్య ఆదివారం 14వ వారం ఎలిమినేషన్‌ జరిగింది. ఈ వారం మోనాల్‌ ఎలిమినేట్‌ అయ్యారు. ఎన్నో రోజులుగా మోనాల్‌ ఎలిమినేట్‌ అవుతుందని భావించారు. కానీ ఆమె సర్వైవ్‌ అవుతూ వస్తున్నారు. చివరికి ఆమెని పంపించేశారు. చివరి వారం ఎలిమినేషన్‌లో ఆమెని ఎలిమినేట్‌ చేశారు బిగ్‌బాస్‌. అనేక విమర్శలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాడు. 

ఎట్టకేలకు బోల్డ్ బ్యూటీ అరియానా ఫైనల్‌కి చేరింది. దీంతో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ఫైనలిస్ట్ తేలిపోయింది. అఖిల్‌, సోహైల్‌, అభిజిత్‌, హారిక, అరియానా ఫైనల్‌ కి ఎంపికయ్యారు. ఇక అసలు గేమ్‌ ఇప్పుడు ప్రారంభం కానుంది. ఇందులో ఎవరు ఫైనల్‌కి వెళ్తారనేది ఆసక్తి నెలకొంది. బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ గేమ్‌ ఇప్పుడు మరింత రంజుగా మారనుంది. 

ఇక వెళ్తూ వెళ్తూ.. మోనాల్‌ ఫైనలిస్ట్ కి పలు సూచనలు చేసింది. అభిజిత్‌ చాలా మంచి వాడని, ఇంకా బాగా ఆడాలని, అరియానాని కోపం తగ్గించుకోవాలని తెలిపింది. అయితే మోనాల్‌ ఎలిమినేట్‌ అయినప్పుడు అఖిల్‌ షాక్‌కి గురయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆమెకి `ఉండిపోరాదే.. ` అంటూ పాట కూడా పాడడం వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ని, లవ్‌ అండ్‌ ఎఫెక్షన్‌ని చూపిస్తుంది.