మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ జూన్ 19న విడుదల కానుండగా పాజిటివ్ బజ్ నడుస్తుంది. ముఖ్యంగా అఖిల్, పూజా మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరిందట. ఇక అఖిల్, పూజ మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు అలరిస్తాయని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు ఆకట్టుకున్నాయి.

ఒక్క హిట్... అక్కినేని వారసుడు అఖిల్ కి ఒక్క హిట్ కావాలి. ఈ యంగ్ హీరో ఇప్పటికే మూడు చిత్రాలు చేశారు. అఖిల్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తో అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. దర్శకుడు వి వి వినాయక్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్లాప్ కావడం జరిగింది. ఆ తరువాత టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ తో హలో అనే రొమాంటిక్ డ్రామా చేశారు. అది కూడా అఖిల్ కి హిట్ ఇవ్వలేకపోయింది. ఇక అఖిల్ చివరి మూవీ మిస్టర్ మజ్ను సైతం నిరాశపరిచింది. వరుసగా మూడు ప్లాప్స్ అందుకున్న అఖిల్ చాలా డిస్సప్పాయింట్ అయ్యారు. తండ్రి నాగార్జున సైతం అఖిల్ కి ఎలాంటి సబ్జెట్ సూట్ అవుతుందా అనే ఆలోచనలో పడ్డారు. 


చాలా ఆలోచించి బొమ్మరిల్లు డైరెక్టర్ భాస్కర్ తో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని సెట్ చేశారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీతో హిట్ కొట్టాలని అఖిల్ గట్టినమ్మకంతో ఉన్నారు. నాగార్జున సైతం ఈ మూవీలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారట. తన అనుభవాన్ని ఉపయోగించి అనేక మార్పులు చేర్పులు సూచించారట. అలాగే టాలీవుడ్ టాప్ హీరోయిన్, లక్కీ లేడీ పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నారు. 

ఈ మూవీ జూన్ 19న విడుదల కానుండగా పాజిటివ్ బజ్ నడుస్తుంది. ముఖ్యంగా అఖిల్, పూజా మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరిందట. ఇక అఖిల్, పూజ మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు అలరిస్తాయని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు ఆకట్టుకున్నాయి. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.