Akhil:హిట్ ఇచ్చిన డైరక్టర్ తోనే అఖిల్ నెక్ట్స్?
వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో హనీ ట్రాప్ ఆధారిత కథాంశంతో ‘ఏజెంట్’ తెరకెక్కుతోందని ఓ ర్యూమర్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే విడుదల చేసిన అఖిల్ లుక్ బాగా వైరల్ అయింది. ఈ సినిమాతో అఖిల్ కు మొదటి బ్లాక్ బస్టర్ హిట్ నమోదవుతుందని ఫ్యాన్స్ నమ్మకం..
అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ చిత్రం చేస్తున్నారు. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం తర్వాత అఖిల్ చేయబోయే సినిమా కూడా దాదాపు ఓకే అయ్యినట్లే తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు బొమ్మరిల్లు భాస్కర్. అఖిల్ కెరీర్ లో తొలి హిట్ గా నిలిచిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్’. ఈ చిత్రం తర్వాత అక్కినేని వారసుడిగా అఖిల్ కు టాలీవుడ్ లో రెడ్ కార్పెట్ ఎదురైంది అనే చెప్పాలి. దాంతో అఖిల్ మరోసారి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ మేరకు రీసెంట్ గా కథ చెప్పి ఒప్పించారని, త్వరలోనే పూర్తి స్క్రిప్టుతో కలుస్తాను అని చెప్పినట్లు సమాచారం. అలాగే ఈ సినిమా తర్వాత మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్టు చేయటానికి అఖిల్ ఉత్సాహం చూపిస్తున్నారు. ఆ చిత్రానికి మోహన్ రాజా దర్శకుడు అని తెలుస్తోంది. అది కూడా త్వరలో ఫైనల్ కానుంది.
ఇక ఏజెంట్ విషయానికి వస్తే.. ‘ఏజెంట్’ సినిమా అఖిల్ కు ఆ రేంజ్ హిట్ ఇస్తుందని ఆశిస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, ముమ్ముట్టి, సాక్షి వైద్య ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న ‘ఏజెంట్’ మూవీ ని ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇప్పటికే వైజాగ్, నెల్లూరు పోర్టులలో షూటింగ్ ముగించుకున్న ఏజెంట్, స్పెయిన్ లో లాంగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసింది.
వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో హనీ ట్రాప్ ఆధారిత కథాంశంతో ‘ఏజెంట్’ తెరకెక్కుతోందని ఓ ర్యూమర్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే విడుదల చేసిన అఖిల్ లుక్ బాగా వైరల్ అయింది. ఈ సినిమాతో అఖిల్ కు మొదటి బ్లాక్ బస్టర్ హిట్ నమోదవుతుందని ఫ్యాన్స్ నమ్మకం..ఏజెంట్ సినిమా ఆగస్టు 12న రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేసింది. సినిమాకు సంబంధించి ఓ షెడ్యూల్ ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉన్న కారణంగా మూవీ అనుకున్న సమయానికి రిలీజ్ కాలేదని ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. దీంతో మేకర్స్ స్పందించి రూమర్లపై స్పష్టత ఇచ్చారు. అనుకున్న సమయానికే సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య అనే కొత్త అమ్మాయి పరిచయం కాబోతుంది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురెందర్ 2 సినిమాస్ పతాకాలపై రాంబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు.