Asianet News TeluguAsianet News Telugu

లై సినిమా పై కన్నేసి వుంచిన అఖిల్

  • లై సినిమాను క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్న అఖిల్ అక్కినేని
  • గతంలో అఖిల్ కు కథ చెప్పిన హను రాఘవ పూడి
  • "లై" సక్సెస్ అయితే హనుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనుకుంటున్న అఖిల్
akhil akkineni watching keen about nitin lie result

అందాల రాక్షసి చిత్రంతో దర్శకుడిగా వచ్చి ప్లాప్ కొట్టినా కూడా హను రాఘవపూడికి విమర్శకుల ప్రసంసలు దక్కాయి. ఆ తరవాత ఆయన నానితో తీసిన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రం చాలా సూపర్ హిట్ అయ్యింది. నానీ కెరీర్ కే అది బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి.. హనుకు కమర్షియల్ గా కూడా వెళ్లొచ్చు అని ఆ సినిమా నిరూపించింది.

 

ఇప్పుడు లై చిత్రంతో ఒక డిఫరెంట్ జానర్ తో రాబోతున్నాడు హను. నితిన్ ని ఇప్పటి వరకూ ఎవ్వరూ చూపించని ఒక టఫ్ కుర్రాడిగా చూపిస్తో మేక్ ఓవర్ లో కూడా గడ్డం పెంచి హను పెద్ద ప్రయోగం చేస్తున్నాడు. ఈ సినిమా మీద నితిన్ తో పాటు అక్కినేని అఖిల్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని తెలుస్తోంది.

 

హను చెప్పిన ఒక సబ్జెక్ట్ ని కొన్ని నెలల క్రితం అఖిల్ హోల్డ్ లో పెట్టి తరవాత డ్రాప్ అయ్యాడు అదే స్టోరీ ఇప్పుడు నితిన్ చేస్తున్నాడు అని ఫైల్ నగర్ టాక్. కానీ హను దీనిమీద మీడియా లో సమాధానం కూడా ఇచ్చాడు.

”ఆ క‌థ వేరు.. ఇది వేరు. అఖిల్ కోసం ఆ క‌థ అలానే ఉంది. అఖిల్ నుంచి ఎప్పుడు పిలుపొచ్చినా చేయ‌డానికి సిద్థంగా ఉన్నా” అని క్లారిటీ ఇచ్చాడు హ‌ను.  అఖిల్ కి ఈ కొత్త కథ నచ్చింది కానీ హను లై రిజల్ట్ మీద కన్నేసాడు అఖిల్. అది గనక హిట్ అయితే హను తో సినిమా ఓకే చేద్దాం అని చూస్తున్నాడు. మరి  లై అఖిల్ కు ఏం మెసేజ్ ఇస్తుందో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios