సాధారణంగా కార్తీక మాసం వచ్చిందంటే ‘స్వామియే శరణమయ్యప్ప’ వాడవాడలా అయ్యప్ప శరణుఘోష వినిపిస్తుంది. అయితే మన సినీ పరిశ్రమలో కాస్తంత ముందే వచ్చింది. ‘స్వామియే శరణమయ్యప్ప’…  అంటూ భక్తకోటి శబరిమల వైపు అడుగులు వేసేందుకు దీక్ష పూనుతున్నారు.  సాధారణంగా మన స్టార్ హీరోలు ఎప్పుడు చూసినా చాలా స్టైలిష్ లుక్స్ తో చాలా ట్రెండీగా కనిపిస్తూ ఉంటారు. అలా కనిపిస్తేనే ప్రేక్షకులు వారిని అభిమానులు మరింతగా ఆరాదిస్తారు. కాబట్టే సినిమాల్లో మరియు బయట కూడా తెలుగు హీరోలు డీ గ్లామర్ గా కనిపించేందుకు అస్సలు ఆసక్తి చూపించరు. 

దాంతో హీరోలు రియల్ లైఫ్ లో పూజలు - దీక్షలు అంటూ బయట ఎక్కువగా కనిపించరు. అయితే తెలుగు హీరోల్లో రామ్ చరణ్ మాత్రమే తరుచుగా అయ్యప్ప దీక్షలో కనిపిస్తూ ఉంటాడు. గత ఏడాది శర్వానంద్ కూడా అయ్యప్ప దీక్ష పట్టాడు. ఇక ఇప్పుడు యంగ్ స్టార్ హీరో అఖిల్ కూడా అయ్యప్ప దీక్ష పట్టాడు. అఖిల్ అక్కినేని ఈ లాక్ డౌన్ పీరియడ్ ని సెల్ఫ్ రియలైజేషన్, ఆధ్యాత్మిక వికాసం కోసం వాడుతున్నారు. ఈయన అయ్యప్ప దీక్ష తీసుకుని సంప్రదాయమైన నల్ల బట్టల్లో కనపడ్డారు. 

రెగ్యులర్ సెలబ్రెటీ జీవితానికి దూరంగా సిటీకి దూరంగా కొన్ని రోజుల పాటు అయ్యప్ప స్వామి పూజలోనే అఖిల్ గడుపుతున్నారు. అఖిల్ దీక్ష తీసుకున్న ఫొటోలు అయితే బయటకు రాలేదు. కాని ఒక ఫొటో మాత్రం బయిటకు వచ్చింది. ఆయన సన్నిహితులు మీడియాకు అనఫిషియల్ గా చెబుతున్నారు.  స్వామి అయ్యప్ప దీక్ష అంటే కఠిన నియమాలతో కూడి ఉంటుంది.అఖిల్ ఈ  దీక్షతో అయినా సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో చూడాలి.