విజయ్ దేవరకొండతో గీతా గోవిందం వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు పరుశరామ్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై చేసిన ఈ చిత్రం ఘన విజయం సాధించినా ఇప్పటివరకూ ఆయన తదుపరి చిత్రం ప్రారంభం కాలేదే. అయితే గీతా గోవిందం తర్వాత అందరూ మహేష్ తో సినిమా చేస్తాడనుకున్నారు. ఈ మేరకు చర్చలు కూడా జరిగాయి. అయితే పరుశరామ్ ని ప్రక్కన పెట్టి నెక్ట్స్ ఇయిర్..వంశీ పైడిపల్లితో సినిమాకు సై అన్నాడు. దాంతో పరుశరామ్ మళ్లీ హీరో ని వెతుక్కోవాల్సిన సిట్యువేషన్ ఏర్పడింది.

దాంతో ఎన్టీఆర్ కు సైతం పరుశరామ్ వెళ్లి కథ చెప్పారట. అయితే ఎన్టీఆర్ కు పూర్తి గా నచ్చలేదట. తన ఇమేజ్ కు సరపడే సబ్జెక్ట్ కాదని తనకన్నా చిన్న వయస్సు  హీరోతో సినిమా చేయటం బెస్ట్ సలాహా ఇచ్చారట. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సైతం ఆ సబ్జెక్టుపై పూర్తి నమ్మకం లేదట. అయినా ఇచ్చిన మాట ప్రకారం హీరోల దగ్గరకు స్క్రిప్టు నేరేషన్ కు పంపుతున్నాడట.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ అఖిల్ కు నచ్చిందట.

అయితే ఇప్పటికే అఖిల్ తమ బ్యానర్ లో బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా చేస్తూండటంతో అల్లు అరవింద్ తాను నిర్మించలేనని చెప్పారట. అందులోనూ ఆ కథ బడ్జెట్ తో కూడుకున్నదిట. అఖిల్ పై అంత పెడితే రికవరీ కష్టమని అన్నాడట. దాంతో నాగార్జునఈ కథ విని తమ అన్నపూర్ణ బ్యానర్ లో సినిమా చేస్తానని మాట ఇచ్చారట. అలా గీతా గోవిందం తర్వాత పరుశరామ్ తో చేయబోయే సినిమా అఖిల్ తో సెట్ అయ్యిందట.