సారాంశం

  అఖిల్ నెక్ట్స్ ప్రాజెక్టు ఎవరితో చేయబోతున్నాడు.? ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.? అన్న డిస్కషన్స్ మొదలయ్యాయి.ఈ నేపధ్యంలో  అఖిల్ నెక్ట్స్  గురించిన ఓ వార్త ఇప్పుడు మీడియాలో హల్ చల్ చేస్తోంది.  అదేమిటంటే...
 


అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన  అఖిల్ కు కెరీర్ ప్రారంభం నుంచి సరైన హిట్ పడటం లేదు.   బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అనే సినిమా ఉన్నంతలో హిట్ పడింది. కానీ  ఆ క్రెడిట్ అంతా పూజాహెగ్డేకి ఖాతాలో పడింది. దానికి తోడు  సినిమాలో కూడా ఎక్కువ శాతం పూజాహెగ్డే పై ఉండటం కూడా అక్కినేని ఫ్యాన్స్ ను నిరాశపరిచింది. ఆ తర్వాత  భారీ అంచనాలు పెట్టుకున్న ఏజెంట్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అంత పెద్ద డిజాస్టర్ అవటం ఎవరూ ఊహించలేదు. ఈ క్రమంలో  అఖిల్ నెక్ట్స్ ప్రాజెక్టు ఎవరితో చేయబోతున్నాడు.? ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.? అన్న డిస్కషన్స్ మొదలయ్యాయి.ఈ నేపధ్యంలో  అఖిల్ నెక్ట్స్  గురించిన ఓ వార్త ఇప్పుడు మీడియాలో హల్ చల్ చేస్తోంది.  అదేమిటంటే...

విరూపాక్ష తో   బ్లాక్ బస్టర్ కొట్టిన కార్తీక్ దండు ఈ మద్యే అఖిల్ కి ఒక స్టోరీ  లైన్ చెప్పాడని తెలుస్తోంది.  ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు శర వేగంగా జరుగుతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే అఖిల్ , కార్తీక్ కాంబినేషన్ లో ఓ మూవీ రూపొందే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్టు  ఇంకా ఖరారు కాలేదు.

 సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా న‌టించిన చిత్రం ‘విరూపాక్ష‌’. మిస్టిక‌ల్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో ఈ మూవీని కార్తీక్ దండు తెర‌కెక్కించారు. భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ లేకుండా రూపొందట‌మే కాకుండా విడుద‌ల స‌మ‌యంలోనూ, పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కావాల్సిన ఈ మూవీ స‌రైన స‌మ‌యం లేక‌పోవ‌టంతో తెలుగులోనే రిలీజ్ అయ్యింది. అయితేనేం ‘విరూపాక్ష‌’ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. సినిమా నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించ‌టం విశేషం. ఈ స‌స‌క్సెస్‌పై సాయిధ‌ర‌మ్ తేజ్ ఫ్యాన్స్ సంతోషాన్ని వ్య‌క్తం చేసారు. 
 
ఇక అక్కినేని హీరోల్లో ...నాగార్జున నా సామీ రంగాలో బిజీగా ఉన్నారు. నాగ చైతన్య దర్శకుడు చందూ మొండేటి కోసం ప్రీ ప్రొడక్షన్ లోనూ ఇన్వాల్వ్ అవుతున్నారు. సుమంత్, సుశాంత్ లు సైతం చేతిలో ఒకటి రెండు సినిమాలు చేస్తున్నారు.