టాలీవుడ్ లో మరో బిగ్ అనౌన్స్‌మెంట్‌  వచ్చింది. అక్కినేని నట వారసుడు అఖిల్‌ ఓ స్టైలిష్ యాక్షన్‌ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ప్రకటన ఈ రోజు ఉదయం 9 గంటల 9 నిమిషాల 9 సెకన్లకు చేశారు చిత్రయూనిట్. అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌తో కలిసి దర్శకుడు సురేందర్‌ రెడ్డి స్వయంగా నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాకు వక్కంతం వంశీ కథ అందిస్తున్నాడు. అఖిల్‌ 5వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్‌ కావాల్సి ఉన్నా లాక్ డౌన్‌ కారణంగా వాయిదా పడింది. సైరా నరసింహారెడ్డి రిలీజ్ తరువాత లాంగ్ బ్రేక్‌  తీసుకున్న దర్శకుడు సురేందర్‌ రెడ్డి కొంత కాలంగా అఖిల్ సినిమా కథ విషయంలో బిజీగా ఉన్నాడు.