Akhil: అఖిల్‌ సినిమా టైటిల్‌ లీక్‌.. జెర్సీ వైరల్‌.. హీరోయిన్‌ కూడా ఫిక్స్?

`ఏజెంట్‌` వంటి డిజాస్టర్ తర్వాత అఖిల్‌ అక్కినేని మరో ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్‌ లీక్‌ అయ్యింది. వరల్డ్ కప్ మ్యాచ్‌తో అది వైరల్‌ అవుతుంది.

akhil akkineni new movie title leak with jersey also heroine fix ? arj

అక్కినేని అఖిల్‌కి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ హిట్‌ లేదు. `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్ లర్‌` ఓకే అనిపించింది. మొదటి సినిమా నుంచి అన్నీ పరాజయం చెందాయి. గత సినిమా `ఏజెంట్‌` బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ దాదాపు 70కోట్లతో రూపొందింది. కనీసం పది కోట్ల షేర్‌ ని కూడా రాబట్టుకోలేకపోయింది. మలయాళ స్టార్‌ మమ్ముట్టి సైతం ఇందులో నటించడం విశేషం. కానీ ఫలితం లేదు. 

ఇక ఇప్పుడు ఆయన అనిల్‌ కుమార్‌ అనే యంగ్‌ డైరెక్టర్‌తో ఓ సినిమా(Akhil6) చేస్తున్నారు. ఆయన `సాహో` చిత్రానికి అసిస్టెంట్‌గా చేశాడు. యూవీ క్రియేషన్స్ లో ఈ మూవీ రూపొందుతుంది. ఈ సినిమా బడ్జెట్‌ సంచలనంగా మారింది. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారని అంటున్నారు. కానీ అది జస్ట్ ప్రచారం మాత్రమే అని, కానీ వాస్తవంగా అందులో సగం కి తక్కువే అని టాక్‌. `ఏజెంట్‌` డిజాస్టర్‌ తర్వాత అంతటి బడ్జెట్‌ పెట్టేందుకు ఎవరూ ముందుకు రారు, ఈ నేపథ్యంలో కావాలని సృష్టించిన పుకారుగా తెలుస్తుంది. వాస్తవ బడ్జెట్‌ చాలా తక్కువగా ఉంటుందని తెలుస్తుంది. 

సోషల్‌ ఫాంటసీగా ఈ మూవీని రూపొందిస్తున్నారట. అఖిల్‌ ఓ కొత్త లుక్‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ భారీ యాక్షన్‌ ప్రధానంగా సాగుతుందని తెలుస్తుంది. అయితే ఈ చిత్రానికి టైటిల్‌ చాలా కాలంగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. `ధీర` అనే టైటిల్‌ని పరిగణిస్తున్నారని, అది ఫైనల్‌ అంటూ రూమర్స్ వచ్చాయి. కానీ దీనిపై ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. 

ఈ నేపథ్యంలో తాజాగా అఖిల్‌ ధరించి జెర్సీ ఒకటి వైరల్‌ అవుతుంది. ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా వరల్డ్ కప్‌ మ్యాచ్‌ వీక్షించేందుకు అఖిల్‌ స్టేడియంకి వెళ్లారు. ఆయన `ధీర` అనే పేరుతో ఉన్న జెర్సీ ధరించారు. అదే కాదు ఓ చిన్న పిల్లాడు సైతం `ధీర` పేరుతో ఉన్న జెర్సీ ధరించారు. అది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దానికి అఖిల్‌ అక్కినేని యాష్‌ ట్యాగ్‌ కూడా ఉంది. దీంతో అఖిల్‌ సినిమా టైటిల్‌ ఇదే అని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇంకా చెప్పాలంటే అఖిల్‌ తన సినిమా టైటిల్‌ని పరోక్షంగా లీక్‌ చేశాడని చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే ఈ మూవీలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ బ్యూటీ పేరు వినిపిస్తుంది. అఖిల్‌ సరసన అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ని అనుకుంటున్నారట. దాదాపు ఫిక్స్ అయ్యిందని తెలుస్తుంది. ఇప్పటికే జాన్వీ.. ఎన్టీఆర్‌తో `దేవర` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పుడు అఖిల్‌ సరసన కూడా నటించేందుకు ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు టాక్‌. వీటిలో నిజనిజాలేంటనేది మున్ముందు తేలనుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios