అక్కినేని అఖిల్ మూడవసారి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాడు. మిస్టర్ మజ్ను సినిమా ఈ నెల 25న రిలీజ్ కాబోతోంది. అయితే ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీ బిజీగా మారిన అఖిల్ ఇతర పనులుంటే కూడా ఏ మాత్రం మిస్ అవ్వకుండా పూర్తి చేసుకుంటున్నాడు. రీసెంట్ గా తన అసిస్టెంట్ పెళ్లికి కూడా వెళ్లాడు. 

అక్కినేని కంపెనీకి సంబందించిన అసిస్టెంట్ స్టాఫ్ తో అఖిల్ ఫ్రెండ్లిగా గడుపుతుంటాడనేది ఫిల్మ్ నగర్ లో ఒక టాక్ ఉంది. ఇక అందులో ఒక సభ్యుడైన మౌసెస్ మ్యారేజ్ కి అఖిల్ స్పెషల్ గెస్ట్ గా వెళ్ళాడు. ఆంధ్రప్రదేశ్ లోని ఈస్ట్ గోదావరి జిల్లాలో జరిగిన ఈ వేడుకకు అఖిల్ వస్తున్నాడని తెలుసుకొని జనాలు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. 

అందరికి అభివాదం తెలుపుతూ నూతన వధూవరులను అఖిల్ తన విషెష్ ను అందించాడు. అందుకు సంబందించిన ఫోటోలను పైన చూడవచ్చు. ఇక శనివారం అఖిల్ మిస్టర్ మజ్ను ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్ గా వస్తోన్న సంగతి తెలిసిందే.