Asianet News TeluguAsianet News Telugu

‘ఏజెంట్’ప్రీ రిలీజ్ బిజినెస్...బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత

  అఖిల్ చివరి సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'​ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.18.50 కోట్లు జరగగా.. ఇప్పుడు 'ఏజెంట్' దానికి డబుల్ ఫిగర్స్​ను అందుకుంది.

Akhil Agent Pre Release Business Details
Author
First Published Apr 27, 2023, 12:17 PM IST


రెండేళ్ల క్రితం 2021లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌’ మూవీతో హిట్ అందుకున్నారు  అక్కినేని అఖిల్ (Akhil Akkineni). ప్రస్తుతం ‘ఏజెంట్’తో (Agent) మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రాన్ని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. సాక్షి వైద్య హీరోయిన్ కాగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి  కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 28న విడుదలవుతోంది. ఇప్పటికే రిలీజైన  ట్రైలర్ చూస్తుంటే హాలీవుడ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలగక మానదు.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ రేంజిలో జరిగిందనేది హాట్ టాపిక్ గా మారింది.  అఖిల్ చివరి సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'​ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.18.50 కోట్లు జరగగా.. ఇప్పుడు 'ఏజెంట్' దానికి డబుల్ ఫిగర్స్​ను అందుకుంది.

ట్రేడ్​ వర్గాల సమాచారం ప్రకారం.. ఏరియా వైజ్ 

 నైజాం ఏరియాలో​ రూ.10కోట్లు,
 సీడెడ్​ రైట్స్​ రూ.4.50కోట్లు,
 ఆంధ్ర ఏరియా మొత్తం రూ.14.80కోట్లు,
 ఆంధ్ర-తెలంగాణ కలిపి రూ.29.30కోట్లు, 
కర్ణాటక అండ్​ రెస్టాఫ్ ఇండియా కలిపి రూ.3.80కోట్లకు,
 ఓవర్సీస్​ ద్వారా రూ.3.10కోట్లు. 
మొత్తంగా వరల్డ్​ వైడ్​ రూ.36.20కోట్లు బిజినెస్ చేసినట్లు తెలిసింది. 
అంటే సినిమా బ్రేక్ ఈవెంట్ టార్గెట్​ రూ.37కోట్లు అన్న మాట. అఖిల్ కెరీర్ ఇది​ సెకండ్ హైయెస్ట్​ ప్రీ రిలీజ్​ బిజినెస్​. 

ఆయన నటించిన మొదటి సినిమా అఖిల్​.. అప్పట్లో ప్రీ రిలీజ్​ బిజినెస్​ రూ.42కోట్లు జరగగా.. 'ఏజెంట్' దానికి దగ్గరగా వచ్చింది.  ఈ స్పై థ్రిల్లర్‌ను చూస్తుంటే ఇది ముగ్గురు వ్యక్తుల మధ్య థ్రిల్లింగ్ గేమ్‌ను తలపిస్తోంది. ఇండియన్ గవర్నమెంట్.. ‘స్పై’ అఖిల్‌కు ప్రమాదకరమైన మిషన్ అప్పగిస్తుంది. ఈ ఏజెన్సీకి మమ్ముట్టి చీఫ్‌గా కనిపించగా.. డినో మోరియా విలన్ పాత్రలో దర్శనమిచ్చాడు.  పూర్తిగా యాక్షన్ అండ్ చేజింగ్ సీన్లతో ఎగ్జైట్‌మెంట్ కలిగించారు మేకర్స్.

 ఏజెంట్ అనే టైటిల్ ను బట్టే ఇదో స్పై థ్రిల్లర్ అని అర్థం అవుతుంది. సాధారణంగా  స్పై థ్రిల్లర్స్ లో హీరో మాగ్జిమం చాలా సీరియస్ గా ఉంటాడు. అతనికి అసమాన ప్రతిభ ఉంటుంది. స్టంట్స్ నుంచి లాంగ్వేజెస్ వరకూ ఏదైనా మ్యానేజ్ చేయగలడు. అఫ్ కోర్స్ రొమాన్స్ లోనూ పట్టు ఉంటుంది. నాటి జేమ్స్ బాండ్ నుంచి రీసెంట్ గా తెలుగులో వచ్చిన గూఢచారి వరకూ ఇదే కనిపించింది. అయితే  అందుకు భిన్నంగా ఉంటాడు ఈ ఏజెంట్. ‘రా’లో పనిచేసే ఓ ఆఫీసర్.. దేశంలోనే అత్యంత పెద్దదైన మాఫియా ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అతని వల్ల కాక ఓ పిల్ల హీరోను పంపిస్తాడు. ఆ పిల్ల హీరోనే ఏజెంట్. 

అయితే అతన్ని పవర్ ఫుల్ ఏజెంట్ గా కాక   ఓ కోతిలాంటి వాడు అనే పంపుతారు. అతని క్యారక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. రేసుగుర్రంలో అల్లు అర్జున్ తరహా లో ఉండబోతోందని తెలుస్తోంది. ‘సింహం బోనులోకి వెళ్లి తిరిగి రాగలిగేది కోతి మాత్రమే’ అనే పాయింట్ ఆధారంగా డిజైన్ చేసారు.  ఈ క్యారక్టరైజేషన్ ప్రకారం హీరో అన్నీ కోతి వేషాలు వేస్తాడు. ఏ మాత్రం సీరియస్ నెస్ ఉండదు. పైగా అతనికి గన్స్ అంటే ఇష్టం.   సిందూరంలో రవితేజ కూడా ఇలా గన్స్ పిచ్చితోనే నక్సలైట్స్ లోకి వెళతాడు. కానీ అతనికి సిద్ధాంతం తెలియదు. అంటే ఇక్కడా ఏజెంట్ కు తన రా గురించి తెలియదు. అసలు టైటిల్ కు తగ్గట్టుగా ఈ హీరో క్యారెక్టరైజేషన్ సినిమాలో అయితే మచ్చుకు కూడా కనిపించలేదు. 

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ ఏజెంట్ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తున్నారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి చాలా రోజుల తర్వాత ఓ తెలుగు సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. స్టార్ రైటర్ వక్కంతం వంశీ ఈ సినిమాకు కథను అందించారు. ఏప్రిల్ 28న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios