అఖిల్ ‘ఏజెంట్’బడ్జెట్ అంతా, రికవరీ ఎలా సామీ?
ఏజెంట్ అనే టైటిల్ తో వస్తోన్న ఈ సినిమా ఓ స్పై థ్రిల్లర్ . ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన గ్లిమ్స్, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ సినిమా గత మూడేళ్లుగా షూటింగ్‌ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. తొలుత ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించారు. కానీ షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో వాయిదాపడింది. అయితే ఇంతకాలం షూటింగ్, రీషూట్ లు అంటే మాటలు కాదు. బడ్జెట్ బెంబేలెత్తిస్తుంది. అదే ఈ సినిమాకు జరిగిందని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఏప్రియల్ లో రిలీజ్ అంటున్నారు. ఆ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసే సమయం దగ్గర పడిన ఈ టైమ్ లో ఈ చిత్రం బడ్జెట్ ఎంత అయ్యిందనే విషయమై డిస్కషన్స్ మొదలయ్యాయి ట్రేడ్ లో .
అందుతున్న సమాచారం మేరకు ... ఈ సినిమా ఎనభై కోట్లు దాటిందని వినపడుతోంది. మొదట ముప్పై ఐదు,నలభై అంటూ మొదలెట్టిన ఈ సినిమా అలా పెరుగుకుంటూ వెళ్లిపోయి..రెట్టింపు బడ్జెట్ కు చేరుకుంది. ఓ ఛేజ్ మినహా టాకీ పార్ట్ ఫినిష్ అయ్యిందంటున్నారు. ఆ ఛేజ్ ని ఇతర దేశాల్లో ప్లాన్ చేసారట. మరి ఇంత బడ్జెట్ పెట్టి తీసిన సినిమా అఖిల్ మీద వర్కవుట్ అవుతుందా..ఎంత పెద్ద హిట్ అయితే రికవరీ ఉంటుందనే విషయం ఎవరకీ అంతు పట్టడం లేదు. కాకపోతే నిర్మాతలు కొత్త వాళ్లు కాదు కాబట్టి వాళ్లు ప్లాన్స్ వారికి ఉంటాయి. సమ్మర్ రిలీజ్ కాబట్టి ఓపినింగ్స్ ఉంటాయి. సురేంద్రరెడ్డి ఉన్నారు కాబట్టి మంచి బజ్ ఉంటుంది. సినిమా రికవరీల విషయానికి వస్తే ఇదే బ్యానర్ లో మరో సినిమా చేస్తానని అఖిల్ మాట ఇచ్చారని వినికిడి. తప్పదు రిస్క్.
ఏజెంట్ సినిమాను ఏప్రిల్ 14 న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోన్నట్లు సమాచారం. మంచి రిలీజ్ డేట్ కోసం చూస్తున్నట్లు చెబుతున్నారు. ఈ రోజే ప్రకటన వచ్చే అవకాసం ఉంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ తర్వాత అఖిల్ హీరోగా నటిస్తోన్న సినిమా ఇది. ఏజెంట్ సినిమాలో ఎయిట్ ప్యాక్‌లో అఖిల్ కనిపించబోతున్నాడు. ఏజెంట్ క్యారెక్టర్ కోసం ఫిజికల్‌గా చాలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడు. ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా సాక్షి వైద్య హీరోయన్‌గా నటిస్తోంది.
నిర్మాత అనిల్ సుంకరతో కలిసి దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతోనే సురేందర్‌రెడ్డి నిర్మాతగా అరంగేట్రం చేయబోతున్నారు. చిరంజీవి సైరా నరసింహారెడ్డి తర్వాత సురేంద్రరెడ్డి డైరక్షన్ చేస్తున్న చిత్రం ఇది. ఏజెంట్ అనే టైటిల్ తో వస్తోన్న ఈ సినిమా ఓ స్పై థ్రిల్లర్ . ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన గ్లిమ్స్, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.