Asianet News TeluguAsianet News Telugu

అక్కినేని అభిమానులకు అఖిల్ యాక్షన్ ట్రీట్, మనాలీలో మొదలెట్టిన ఏజంట్ టీమ్.

అక్కినేని అఖిల్ ఈ సారి పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తున్నాడు. ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. అందుకే ఫ్యాన్స్ కు భారీ యాక్షన్ ట్రీట్ రెడీ చేస్తున్నాడు.

Akhil Agent Movie Action Shot in Manali
Author
Hyderabad, First Published May 25, 2022, 1:59 PM IST

అక్కిల్ ఈసారి తగ్గేది లేదు అంటున్నాడు. వరుసగా మూడు సినిమాల ప్లాప్స్ చూసిన యంగ్ హీరోకు.. నాలుగో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రం హిట్ టేస్ట్ చూపించింది. దాంతో తరువాత సినిమా సాలిడ్ గా హిట్ సాధించాలి అని ప్లాన్ చేశాడు. పక్కా స్కెచ్ ప్రకారం వెళ్తున్నాడు. 

అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా మూవీ ఏజెంట్. ఈ సినిమా షూటింగ్ సూపర్ స్పీడ్ గా సాగుతోంది. ఇక రీసెంట్ గా ఈమూవీ ఫ్రెష్ షెడ్యూల్ ను మనాలీలో ప్లాన్ చేసింది మూవీ టీమ్. ఇప్పటికే అఖిల్ తో పాటు.. మూవీ టీమ్ అంతా  మనాలీలో ల్యాండ్ అయింది. ఆ విషయాన్ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి ట్విట్టర్ లో వెల్లడించారు. 

 

ఈసారి హిట్ కొట్టేందుకు శ్రమిస్తున్నామని కామెంట్ చేశాడు సురేందర్ రెడ్డి. మనాలీలో భయపెట్టించే యాక్షన్ ఎపిసోడ్స్ ను శరవేగంగా షూట్ చేస్తున్నామని వెల్లడించాడు. సినిమాను ఆగస్టు 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. 

ఈ సినిమా కోసం అఖిల్ బాగా కష్టపడుతున్నాడు. కంప్లీట్ గా మేకోవర్ అయ్యాడు 8 ప్యాక్ తో రచ్చ చేస్తున్నాడు. లాంగ్ కర్లీ హెయిర్ తో న్యూ లుక్ లో కనిపించాడు. లోన్డ్ బాడీతో అమ్మాయిల చూపులు తనవైపు తిప్పుకుంటున్నాడు. మరి ఈసారి అయినా అఖిల్ ఆవలు ఫలిస్తాయో లేదో చూడాలి. ఇక అనిల్ సుంకరతో కలిసి ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ఈసినిమాను నిర్మిస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios