Asianet News TeluguAsianet News Telugu

అఖిల్ నెక్ట్స్ స్క్రిప్టు డిస్కషన్స్ లో రాజమౌళి?

రాజమౌళి కుమారుడు కార్తికేయ, అఖిల్ క్లోజ్ ప్రెండ్స్. వీరిద్దరు కలిసి అఖిల్ సినిమా ఎంట్రీకు ముందే ఓ షార్ట్ ఫిల్మ్ కూడా చేసారు. 

Akhil 6 script changes are going on under the supervision of #SSRajamouli? jsp
Author
First Published Sep 25, 2023, 4:33 PM IST

భారీ చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ రాజమౌళి. ఆయన ఇన్వాల్వ్ మెంట్ ఉందంటే సినిమాకు ఎక్కడలేని క్రేజ్ వచ్చేస్తుంది. అయితే ఆయన కుటంభ సభ్యుల సినిమాల విషయంలో సైతం ఆయన కలిగించుకోరు. కానీ ఇప్పుడు అఖిల్ సినిమా స్క్రిప్టు విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. వివరాల్లోకి వెళితే...

 అఖిల్ అక్కినేని (Akhil Akkineni)కు అర్జెంట్ గా హిట్ కావాలి.  'ఏజెంట్' రిలీజ్ తర్వాత అది డెస్పరేషన్ గా మారిపోయింది.   ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా ఎవరితో? అనే ప్రశ్న మొదలైంది.  ఈ క్రమంలో యువి క్రియేషన్స్ సంస్థలో అఖిల్ తో సినిమా అనే టాక్ బయిటకు వచ్చింది! ఇప్పుడు ఆ పనులు ముమ్మరంగా జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ప్రభాస్ 'సాహో' చిత్రానికి దర్శకత్వ శాఖలో పని చేసిన అనిల్ కుమార్ దర్శకుడు. ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఫుల్ స్వింగులో జరుగుతున్నాయని తెలిసింది.ఈ క్రమంలో ఓ వార్త బయిటకు వచ్చింది. ఈ సినిమా స్క్రిప్టు విషయంలో రాజమౌళి చేయి చేసుకుంటున్నట్లు ఆ వార్త సారాంశం.

#SSRajamouli కుమారుడు కార్తికేయ, అఖిల్ క్లోజ్ ప్రెండ్స్. వీరిద్దరు కలిసి అఖిల్ సినిమా ఎంట్రీకు ముందే ఓ షార్ట్ ఫిల్మ్ కూడా చేసారు. ఆ షార్ట్ ఫిల్మ్ కు కార్తికేయ డైరక్టర్. ఆ షార్ట్ ఫిల్మ్ బయిటకు వదలలేదు. అది ప్రక్కన పెడితే ఇప్పుడు కార్తికేయకు, అఖిల్ కు ఈ దర్శకుడు అనీల్ మంచి స్నేహితుడుట. దాంతో ఎలాగైనా వీరంతా కలిసి ఈ సినిమాని హిట్ కొట్టాలనుకుంటున్నారు. అందుకోసం కార్తికేయ దగ్గరుండి స్క్రిప్టు వర్క్ లో ఇన్వాల్వ్ అవుతున్నారట. అంతేకాదు తన తండ్రి రాజమౌళి ని సైతం రిక్వెస్ట్ చేసి సీన్ లోకి తెచ్చారని సమాచారం. ఆయన ఆధ్వర్యంలో స్క్రిప్టు మార్పులు జరుగుతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. 
  
 ఈ సినిమా ఫాంట‌సీ జాన‌ర్ లో తెర‌కెక్క‌నుంద‌ని తెలుస్తోంది. అలాగే ఈ  సినిమాకు 'ధీర' టైటిల్ ఫిక్స్ చేశారని తెలిసింది. అందులో కథానాయికగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) అఖిల్ సరసన నటించనున్నారట. యువి క్రియేషన్స్ ప్రొడక్షన్ వేల్యూస్ గురించి తెలిసిందే. భారీ బడ్జెట్ ఫిక్స్ అనుకోవాలి.    అయితే యువి బ్యానర్ ఇప్పుడు చిరంజీవి తో సినిమా బిజీలో ఉంది. దాంతో ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంద‌నేది మాత్రం క‌న్ఫర్మ్ కాలేదు. ప్ర‌స్తుతం అఖిల్ ముందు ఓ కొత్త సినిమా ప్రారంభించాలనే ఉత్సాహంతో ఉన్నట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios