Asianet News TeluguAsianet News Telugu

ఆగని అఖండ ప్రభంజనం... ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో రికార్డు వసూళ్లు

అఖండ విడుదలైన ఆరువారాల గడుస్తున్నా జోరు తగ్గలేదు. హైదరాబాద్ లో అత్యంత కీలకమైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అఖండ రికార్డు వసూళ్లు రాబడుతుంది. 

akhanda run still continues gets record collections in rtc cross roads
Author
Hyderabad, First Published Jan 16, 2022, 5:36 PM IST

అఖండ (Akhanda)చిత్రంతో బాలకృష్ణ మరపురాని విజయం అందుకున్నారు. స్టార్ హీరోగా దశాబ్దాలుగా టాలీవుడ్ ని ఏలుతున్న బాలకృష్ణ సైతం కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నారు. కొన్నాళ్లుగా ఆయన నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కనీస వసూళ్లు దక్కించుకోలేకపోతున్నాయి  ఎన్నో అంచనాల మధ్య ఎన్టీఆర్ బియోపిక్స్ చేస్తే... అత్యంత దారుణమైన ఫలితాన్ని చవిచూశాయి. బాలయ్య కెరీర్ లో చెత్త సినిమాలు కూడా ఓ మోస్తరు వసూళ్లు రాబట్టాయి. బియోపిక్స్ మాత్రం కనీస ఆదరణ దక్కించుకోలేకపోయాయి. 

ఎన్టీఆర్ బియోపిక్స్ ఆడుతున్న థియేటర్స్ వద్ద హౌస్ ఫుల్ బోర్డ్స్ ఉంటాయనుకుంటే... ఫ్రీ టికెట్స్ బోర్డ్స్ వెలిశాయి. జరగాల్సిన నష్టం ఎటూ జరిగిపోయింది. కనీసం సినిమాను ప్రేక్షకులకు ఫ్రీగా చూపిద్దామని మేకర్స్ సిద్ధమయ్యారు. అయినా కూడా ఎన్టీఆర్ బయోపిక్ ఆడుతున్న  థియేటర్స్ వైపు జనాలు కన్నెత్తి చూడలేదు. ఎన్టీఆర్ జీవితంలో అనేక కాంట్రవర్సీలు ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు వెన్నుపోటు ఎపిసోడ్ అత్యంత కీలకమైంది. 

అందరికీ తెలిసిన చరిత్రను బాలయ్య తన సినిమాల్లో మార్చి చూపించాడు. చంద్రబాబును మంచిగా చూపించడం కోసం వాస్తవాలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ బియోపిక్స్ తెరకెక్కాయి. దీంతో ప్రేక్షకులు బాలయ్యపై మండిపడ్డారు. చిత్తశుద్ధి లేకుండా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్స్  దారుణ పరాజయం మూటగట్టుకున్నాయి. ఆ తర్వాత విడుదలైన రూలర్ పరిస్థితి కూడా అంతే. రూలర్ మూవీ కూడా అట్టర్ ప్లాప్ ఖాతాలో చేరిపోయింది. 

ఇలాంటి సమయంలో విడుదలైన అఖండ బాలయ్యకు(Balakrishna) అత్యంత అవసరంతో కూడా విజయాన్ని అందించింది. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ 2021 బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. అల్లు అర్జున్ పుష్ప, వకీలు సాబ్ చిత్రాల తర్వాత థర్డ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అఖండ వరల్డ్ వైడ్ గా రూ. 115 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. అయితే అఖండ వసూళ్లు ఇంకా కొనసాగం విశేషం. 

అఖండ విడుదలైన ఆరువారాల గడుస్తున్నా జోరు తగ్గలేదు. హైదరాబాద్ లో అత్యంత కీలకమైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అఖండ రికార్డు వసూళ్లు రాబడుతుంది. జనవరి 15 పండగ రోజున అఖండ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందుకు రూ. 2 లక్షల వసూళ్లు సాధించినట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో విడుదలైన నెల్లన్నర తర్వాత ఈ స్థాయికి వసూళ్లు రాబట్టడం విశేషమే. 

అఖండ ఆర్టీసీ క్రాస్ రోడ్ కలెక్షన్స్ ట్రేడ్ పండితులను సైతం విస్మయపరుస్తున్నాయి. అఖండ మూవీలో బాలకృష్ణ అఘోర పాత్ర చేశారు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా అఖండ తెరకెక్కింది. శ్రీకాంత్ విలన్ రోల్ చేయగా ప్రగ్యా జైస్వాల్ నటించారు. థమన్ సంగీతం అందించారు. ద్వారకా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మిర్యాల రవీంధర్ నిర్మించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios