అఖండ తిరుగులేని బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టేయటం ఫ్యాన్స్ కు ఆనందం కలిగించింది.  అఖండ ఓవ‌రాల్‌గా రు. 150 కోట్ల థియేట్రిక‌ల్ వ‌సూళ్లు కొల్ల‌గొడితే.. రు. 200 కోట్ల టోట‌ల్ వ‌సూళ్లు రాబ‌ట్టింది.


హీరో నందమూరి బాలకృష్ణ , దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“. ఈ మూవీ డిసెంబర్ 2వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి అదే స్దాయిలో ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్ళు సాధించింది. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య అఖండ సినిమాతో ఏపీ, తెలంగాణ‌లో ఉన్న థియేట‌ర్ల‌కు మాంచి ఊపు ఇచ్చాడు. నైజాం లేదు.. ఉత్త‌రాంధ్ర లేదు.. ఈస్ట్‌, వెస్ట్‌, కృష్ణా, గుంటూరు ఇలా ఏ జిల్లా చూసినా కూడా జ‌నాలు అఖండ మానియాతో ఊగిపోయారు. అఖండ తిరుగులేని బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టేయటం ఫ్యాన్స్ కు ఆనందం కలిగించింది. అఖండ ఓవ‌రాల్‌గా రు. 150 కోట్ల థియేట్రిక‌ల్ వ‌సూళ్లు కొల్ల‌గొడితే.. రు. 200 కోట్ల టోట‌ల్ వ‌సూళ్లు రాబ‌ట్టింది.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో జ‌నాలు 50 రోజుల పోస్ట‌ర్ల‌ే కష్టంగా ఉంది. అయినా అఖండ 20కు పైగా కేంద్రాల్లో షిఫ్టింగ్‌ల‌తో 100 రోజులు పూర్తి చేసుకుని.. క‌ర్నూలులో గ్రాండ్‌గా శ‌త‌దినోత్స‌వం పూర్తి చేసుకుంది. అఖండ ఓవ‌రాల్‌గా 4 కేంద్రాల్లో 100 రోజులు డైరెక్టుగా ఆడితే అందులో ఒక్క క‌ర్నూలు జిల్లాలోనే మూడు సెంట‌ర్లు ఉన్నాయి. ఇప్పుడుఓటీటీ లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సూపర్ హిట్ గా నిలిచిన “అఖండ “మూవీ గుంటూరు జిల్లా లోని చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్లో నాలుగు షోలలో నడుస్తుండడం విశేషం.

ప్రతీ షోకు ప్రేక్షకులు వస్తుండడంతో థియేటర్ యాజమాన్యం దీనిని 175 రోజులు ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ సెలబ్రేషన్ ని ప్రెవేట్ గా జరుపుకోబోతున్నారని, బాలయ్య హాజరుకానున్నారని సమాచారం.