బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న `అఖండ 2 చిత్రం టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు ఈ మూవీకి ఓటీటీ పరంగా డిమాండ్ బాగానే ఉందట.
నందమూరి బాలకృష్ణ నెమ్మదిగా తన మార్కెట్‌ని పెంచుకుంటున్నారు. వరుసగా ఆయన నటించిన నాలుగు చిత్రాలు విజయం సాధించడంతో ఇప్పుడు ఆయన సినిమాలకు డిమాండ్ బాగా పెరిగింది.
థియేట్రికల్ బిజినెస్‌తోపాటు ఓటీటీ బిజినెస్ కూడా పెరుగుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు `అఖండ 2` సినిమా ఓటీటీ రైట్స్ కి సంబంధించి షాకింగ్ రేట్ వినిపిస్తుంది.
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో `అఖండ 2
బాలకృష్ణ వరుస సక్సెస్‌లో ఉండటం ఓ కారణమైతే, `అఖండ`కి సీక్వెల్ కావడం మరో కారణం. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ కావడం ఇంకో కారణం. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా విజయం సాధించింది.
ఇంకా చెప్పాలంటే ఒకదాన్ని మించి మరోటి ఉంది. అదే స్థాయిలో విజయాలు సాధించాయి. దీంతో బాలయ్య, బోయపాటి కాంబోకి తిరుగులేదనే టాక్ ఉంది.
భారీ రేట్ పలుకుతున్న `అఖండ 2` ఓటీటీ రైట్స్
అందులో భాగంగానే ఇప్పుడు బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వస్తోన్న `అఖండ 2`కి బిజినెస్ పరంగా చాలా డిమాండ్ ఉందని తెలుస్తుంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలయ్యింది.
ఇది సినిమాపై అంచనాలను పెంచింది. ఈ క్రమంలో `అఖండ 2` ఓటీటీ రైట్స్ భారీ రేటు పలుకుతుందట. చిత్ర బృందం సుమారు రూ.80కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
సుమారు రూ.120 బడ్జెట్‌తో `అఖండ 2` నిర్మాణం
అమెజాన్ ప్రైమ్ వీడియోతో ప్రస్తుతం ఈ ఓటీటీ డీల్ కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే ఇంత మొత్తం పెట్టడానికి అమెజాన్ ప్రైమ్ నిర్వాహకులు వెనకడుగు వేస్తున్నారని,
ఇదే ఇప్పుడు డిస్కషన్ జరుగుతుందని, త్వరలోనే ఈ డీల్ ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. సుమారు రూ. 120 కోట్లతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు బోయపాటి.
బాలకృష్ణ తొలి పాన్ ఇండియా మూవీ `అఖండ 2
ఇటీవల విడుదలైన `అఖండ 2` టీజర్‌లో బాలయ్య విశ్వరూపం చూడొచ్చు. శివుడిని తలపించే అఘోరగా ఆయన రెచ్చిపోయారు. ఓరకంగా విధ్వంసం సృష్టించారు. జస్ట్ టీజరే ఇలా ఉంటే సినిమా ఇంకా ఎలా ఉందబోతుందో అర్థం చేసుకోవచ్చు.
ఈ మూవీని సెప్టెంబర్ 25న దసరా కానుకగా పాన్‌ఇండియా లెవల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఓ రకంగా బాలయ్య ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే కావచ్చు. ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు.

