Asianet News TeluguAsianet News Telugu

కార్తికేయ "ఆకాశవాణి" కథ.. ఆ సినిమా నుంచి ఎత్తారా?

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. 

Akashavani movie inspired from The Gods Must Be Crazy
Author
Hyderabad, First Published Apr 22, 2019, 10:03 AM IST

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఆయన షోయింగ్ బిజినెస్ బ్యానర్‌పై "ఆకాశవాణి" అనే టైటిల్ తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి 'ఈగ', 'బహుబలి' వంటి చిత్రాలకు అసిస్టెంట్‌గా పని చేసిన అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం 1980లలో వచ్చి పెద్ద హిట్టైన The Gods Must Be Crazy అనే చిత్రం నుంచి మెయిన్ థీమ్ లేపేసి తీస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

గాడ్స్ మస్ట్ బి క్రేజీ సినిమాలో ఓ కోకోకోలా బాటిల్ ని ఓ ప్లైట్ లో పై నుంచి క్రిందకు విసరేయటంతో అది వచ్చి ..కల్హారి ఎడారిలో పడుతుంది. అక్కడుండే తెగ..వాళ్లు ఎప్పుడూ అలాంటి బాటిల్ ఒకటి ఉంటుందని వినకపోవటం, చూడకపోవటంతో చాలా ఆశ్చర్యపోతారు. అక్కడ నుంచి ఆ బాటిల్ తో రకరకాల సమస్యలు వస్తాయి. దాదాపు అలాంటి కాన్సెప్టు తోనే ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.

"ఆకాశవాణి"  సినిమాలో ఓ రేడియో పై నుంచి క్రిందకు ఓ గిరిజన తెగ ఉండే అడవిలో పడటం..అక్కడ నుంచి వాళ్ళ జీవితాల్లో వచ్చే మార్పులతో ఫన్నీగా ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది.  అయితే ఇది రూమరా లేక నిజమా అన్నది తేలాలంటే సినిమా రిలీజ్ దాకా ఆగాల్సిందే. 

ప్రముఖ తమిళనటుడు, దర్శకుడు సముద్రఖని కీలకపాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతమందిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్  90 శాతం షూటింగ్ పూర్తయ్యింది.

పాడేరు అడవిలో వేసిన భారీ సెట్‌లో దాదాపు 50 రోజులపాటు ఏకధాటిగా షూటింగ్ చేసి, చాలా క్రిటికల్ సీన్స్ పిక్చరైజ్ చేసారు.. ఈ షెడ్యూల్ అడ్వెంచరస్‌గా సాగింది.. సింగిల్ షెడ్యూల్‌లో సినిమా పూర్తి చేశారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios