ఆకాష్ పూరి హీరోగా పూరీ దర్శకత్వంలో లవ్ స్టోరీతో మూవీ గతంలో తెరకెక్కించిన ఇడియట్, చిరుత తరహాలోనే కథ లైన్ ఈ మూవీలో హిరోయిన్ గా కన్నడ హిరోయిన్ నేహా షెట్టిని ఎంపిక చేసినట్లు టాక్

పూరిజగన్నాథ్ తాజా చిత్రం 'పైసా వసూల్' ఘోర పరాజయం చెందినా పూరి పట్టు విడవకుండా తన తర్వాత సినిమా పనుల్లో బిజీ అయిపోయాడు. తన కొడుకు ఆకాష్‌ హీరోగా తీయబోతున్న ప్రేమకథ చిత్రం కోసం ఏర్పాట్లను వేగవంతం చేసాడు.

ఆకాష్ సరసన హీరోయిన్‌ ఎంపికకుసంబంధించి ఏకంగా పూరి 200 మంది కొత్త అమ్మాయిలను ఆడిషన్ చేయడం ఇప్పడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. సుమారు 200 మంది అమ్మాయిలకి ఆడిషన్స్ నిర్వహించిన తరువాత పూరి ఫైనల్‌గా ఒక అమ్మాయికి ఓటు వేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె పేరు 'నేహా శెట్టి' అని తెలుస్తోంది.

ఈ బ్యూటీ పై పూరి ఫోటో షూట్ ట్రయల్ షూట్ కూడా నిర్వహించి తన సినిమాకు సూటవ్వడంతో పాటు ఆకాష్‌ కు కూడ సరిజోడిగా ఉంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు నేహా శెట్టి కర్నాటకు చెందిన అమ్మాయి. 

కన్నడలో ఇప్పటికే 'ముంగారు మలే 2' అనే సినిమాలో నటించింది. అంతేకాకుండా ఈమె మంగుళూరు అందాలపోటీల్లో నెగ్గి ‘మిస్ మంగుళూరు’ అనే టైటిల్ విన్నర్ గా ఎంపిక అయింది. పూరి స్టైల్ లవ్ స్టోరీస్ చాలా డిఫెరెంట్ గా ఉండే నేపధ్యంలో ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో పూరి చాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన ఆకాష్ 2015లో హీరోగా చేసిన ‘ఆంధ్ర పోరి' సినమా ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆకాష్ ఈ గ్యాప్ లో నటనతో పాటు డాన్స్, యాక్షన్, హార్స్ రైడింగ్ లాంటి వాటిలో శిక్షణ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పూరి తనయుడు ఆకాష్ హీరోగా రూపొందించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న ఈ సినిమాలో ఆకాష్ కేరక్టరైజేషన్.. పూరీ రవితేజ హీరోగా గతంలో రూపొందించిన ఇడియట్, రామ్ చరణ్ ను టాలీవుడ్ కు పరిచయం చేసిన చిరుత.. సినిమాల మేలు కలయికలా వుంటుందట. మరి వరుస పరాజయాలతో ఇక్కట్ల పాలైన పూరీ కొత్త తరం ప్రేక్షకులు మెచ్చుకునేలా ఆకాష్ ను ఏ విధంగా సెటిల్ చేస్తాడో చూడాలి.