Asianet News TeluguAsianet News Telugu

రజినీని ఓడించిన సినిమా.. ఇక్కడ ఫసక్!

కోలీవుడ్ స్టార్ హీరోల్లో అజిత్ రేంజ్ ఎప్పుడు కూడా టాప్ 1 ప్లేస్ కోసం పోటీ పడుతూ ఉంటుంది. మినిమమ్ 100 కోట్లు రాబట్టే హీరోల్లో అజిత్ ప్రతిసారి సక్సెస్ అవుతున్నాడు. పెద్దగా ప్రయోగాలు చేయడు గాని మాస్ మసాలా యాక్షన్ సీన్స్ తో ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంటాడు. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన విశ్వాసం సినిమా తమిళ్ లో గట్టి వసూళ్లనే రాబట్టింది. 

ajith vishwasam telugu box office collections
Author
Hyderabad, First Published Mar 3, 2019, 1:24 PM IST

కోలీవుడ్ స్టార్ హీరోల్లో అజిత్ రేంజ్ ఎప్పుడు కూడా టాప్ 1 ప్లేస్ కోసం పోటీ పడుతూ ఉంటుంది. మినిమమ్ 100 కోట్లు రాబట్టే హీరోల్లో అజిత్ ప్రతిసారి సక్సెస్ అవుతున్నాడు. పెద్దగా ప్రయోగాలు చేయడు గాని మాస్ మసాలా యాక్షన్ సీన్స్ తో ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంటాడు. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన విశ్వాసం సినిమా తమిళ్ లో గట్టి వసూళ్లనే రాబట్టింది. 

పోటీగా రజినీకాంత్ పేట ఉన్నప్పటికీ అజిత్ విశ్వాసం పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లను రాబట్టింది. దాదాపు 130కోట్లకు పైగా వసూళ్లను అందుకొని పొంగల్ విన్నర్ గా నిలిచింది. అయితే ఇటీవల సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. కానీ సినిమాకు అనుకున్నంత రేంజ్ లో అయితే ఆదరణ దక్కలేదు. 

పరీక్షల సమయంలో రిలీజ్ అవ్వడం.. అలాగే సినిమా రొటీన్ మసాలా సినిమా అవ్వడం వల్ల కలెక్షన్స్ కి ఎఫెక్ట్ పడింది. మొదటి రోజు కనీసం 50 లక్షలు కూడా రాలేదు. సినిమాపై బయ్యర్స్ 2కోట్ల 50 లక్షల పెట్టుబడి బాగానే పెట్టారు కానీ ఇప్పుడు ఈ కొలువుడ్ 100 కోట్ల సినిమా తెలుగులో కోటి రాబట్టడమే కష్టంగా మారింది.

సోమవారం సెలవుదినమైనా ఎంతవరకు కలిసొస్తుందో చెప్పలేము. ఆల్రెడీ సినిమా డిజిటల్ వరల్డ్ లో సబ్ టైటిల్స్ తో వస్తుండడంతో సినిమా థియేటర్ కివచ్చి  విశ్వాసం సినిమాను చూడటానికి ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చుపడం లేదు. మొత్తానికి కోలీవుడ్ పొంగల్ ఫైట్ లో రజినీకాంత్ కి పోటీని ఇచ్చిన సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సైలెంట్ అయిపొయింది.    

Follow Us:
Download App:
  • android
  • ios