అఫీషియల్ : “తెగింపు” ఓటిటి డేట్ ఫిక్స్
థియేటర్లలో చూడలేకపోయిన చాలామంది ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. వారికి ఇది శుభవార్త అని చెప్పాలి.

ఈ ఏడాది సంక్రాంతికి భారీ అంచనాల మధ్య విడుదలైన ‘తెగింపు'(తమిళంలో తునివు) బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. బ్యాంక్ రాబరీ నేపథ్యంలో రూపొందిన తెగింపు సినిమాలో మంజు వారియర్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న తెలుగుతో పాటు తమిళంతో ఒకేరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
తాజాగా ఈ చిత్రం ఓటీటీ లోకి రాబోతున్నది. ఈ సినిమా ఫిబ్రవరి 8 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారుసంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా రిలీజ్ అయింది. థియేటర్లలో విడుదలై నెల రోజులు కాకముందే తునివు ఓటీటీలోకి రాబోతుండటం సిని వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తమిళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా ఫిబ్రవరి 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో చూడలేకపోయిన చాలామంది ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. వారికి ఇది శుభవార్త అని చెప్పాలి.
ఓటిటి రిలీజ్ కోసం ఓ ప్రమోషనల్ వీడియో కూడా రిలీజ్ చేశారు. దాంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా మొదలెట్టేసారు. థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు ఏ రేంజిలో సందడి చేశారో.. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా అంతే సందడి చేయటం విశేషం.
ఇక రిలీజ్ కు ముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను రికార్డ్ ధరకు నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. యాక్షన్ అంశాలకు సామాజిక సందేశాన్ని మేళవించి దర్శకుడు హెచ్ వినోద్ తునివు సినిమాను తెరకెక్కించాడు. ఇందులో డార్క్ డెవిల్ అనే ఇంటర్నేషనల్ క్రిమినల్ గా అజిత్ కనిపించాడు. అజిత్ క్యారెక్టర్జేషన్, యాక్టింగ్ అభిమానులను ఆకట్టుకున్నాయి. డివైడ్ టాక్ తెచ్చుకున్నా ...అజిత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తో ...వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 150 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు భారీగా లాభాలను మిగిల్చింది.