Asianet News TeluguAsianet News Telugu

అజిత్ తమిళ సినిమా తెలుగు టైటిల్ ఫిక్స్.. టాలీవుడ్ మార్కెట్ ను గట్టిగా టార్గెట్ చేసిన కోలీవుడ్ హీరోలు

తమిళ హీరోలు తెలుగు మార్కెట్ ను టార్గెట్ చేశారు. ఇక్కడ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కొంత మంది మాత్రం తమిళ సినిమాలను తెలుగులో రిలీజ్ చేయడానికి భారీగా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా అజిత్ తునివు సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు.. తెలుగు టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. 

Ajith Tamil Movie Telugu Title Fixed
Author
First Published Dec 7, 2022, 5:45 PM IST

అజిత్ కు తమిళ ఇండస్ట్రీలో ఎంత స్టార్ డమ్ ఉందో.. తెలుగులో కూడా అంతే ఉంది. ఆయన ప్రతీ తమిళ సినిమా.. తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. ఇక్కడ కూడా మినిమమ్ కలక్షన్స్ ను సాధిస్తుంది. వరుసగా సినిమాలు చేస్తూ.. తమిళ, తెలుగు  ఆడియన్స్ ను అలరిస్తున్న ఈ హీరో.. త్వరలో  తునివు అనే మరో సినిమాతో సందడి చేయబోతున్నాడు. ఈక్రమంలో ఈమూవీ తెలుగు టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. 

అజిత్ హీరోగా వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తమిళ సినిమా తునివు.. ఈసినిమాకు తెలుగులో తెగింపు' అనే టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయాన్ని ప్రకటించాలని చూస్తున్నారట మేకర్స్.  హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మంజు వారియర్ హీరోయిన్ గా అలరించనుంది. రీసెంట్ గా ఈమూవీ ఓసాంగ్ కూడా పాడింది మంజూ. ఇటు తెలుగు .. అటు తమిళంలో ఈ సారి సంక్రాంతికి విజయ్ వారసుడు సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. ఈక్రమంలో చాలా కాలం తరువాత విజయ్ - అజిత్ సంక్రాంతి బరిలో  పోటీపడుతుండటం ఆసక్తికరంగా మారింది.


అయితే ఈ మధ్య తమిళ సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యే క్రమంలో.. తెలుగు టైటిల్ ప్రత్యేకంగా పెట్టకుండా.. అక్కడి టైటిల్ తోనే తెలుగులోను రిలీజ్ చేస్తున్నారు. సూర్య హీరోగా తమిళంలో రూపొందిన ఈటి .. అజిత్ వలిమై సినిమాలు అదే టైటిల్స్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. టైటిల్ మార్చే ప్రయత్నం చేయలేదు.. కనీసంఆటైటిల్ కు అర్దం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. 

ఇలా తమిళ టైటిల్ తోనే తెలుగులో సినిమాలు  రిలీజ్ చేస్తుండటంతో.. మన ఆడియన్స్ కు విసుగు వచ్చింది. ఈ విషయం తీవ్ర  అసంతృప్తికి గురిచేసింది. దాంతో ఇలాంటిసినిమాలన్నీ ప్లాప్అయ్యాయి. ఎట్టకేలకు ఈ విషయంలో మేకర్స్ లోకదలిక వచ్చింది. ఇలా అయితే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఇక్కడ వర్కౌట్ అవ్వదు అని డిసైడ్ అయ్యారు.  ఈ నేపథ్యంలో అజిత్ నుంచి రానున్న తునివు సినిమాకి ఇక్కడ తెలుగులో టైటిల్ పెట్టాలని నిర్ణయించుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios