`సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి మాస్‌ అండ్‌ స్టయిలీష్‌ హీరో అజిత్‌ ఫోన్‌ చేశాడు`. కోలీవుడ్‌లో ఇప్పుడితే హాట్‌ టాపిక్‌గా మారింది. అజిత్‌.. రజనీకి ఎందుకు ఫోన్‌ చేశాడు? వీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు? ఇటీవల ఎప్పుడూ లేనిది రజనీకి అజిత్‌ ఎందుకు ఫోన్‌ చేయాల్సి వచ్చింది? అని ఇద్దరు హీరోల అభిమానులు గుసగుసలాడుతున్నారు. ఏం మాట్లాడుకున్నారో ఆరా తీసే పనిలో బిజీ అయ్యారు. 

మొత్తానికి రజనీకి అజిత్‌ ఎందుకు ఫోన్‌ చేశాడో కనుకున్నారు. నేటితో(ఆగస్ట్ 15)తో రజనీకాంత్‌ 45ఏళ్ళ సుధీర్ఘ కెరీర్‌ని పూర్తి చేసుకున్నారు. ఆయన నటించిన తొలి చిత్రం `అపూర్వ రాగంగల్‌` 1975 ఆగస్ట్ 15న విడుదలైంది. తన గురువు కె.బాలచందర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విశేష ఆదరణ పొందింది. కమల్‌ హాసన్‌ హీరోగా రూపొందిన ఈ సినిమాలో రజనీ ఓ కీలక పాత్రలో మెరిశారు. తొలి చిత్రంతోనే రజనీ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. తనదైన మేనరిజంతోనూ మెప్పించారు. ఇక అప్పట్నుంచి తాను వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. బస్‌ కండక్టర్‌ స్థాయి నుంచి ఇండియన్‌ సూపర్‌ స్టార్‌ రేంజ్‌కి ఎదిగారు. 

ఈ సందర్భాన్నిపురస్కరించుకుని అజిత్‌..రజనీకి ఫోన్‌ చేశారట. నాలుగున్నర దశాబ్దాల కెరీర్‌ని పూర్తి చేసుకున్న సందర్భంగా రజనీకి అజిత్‌ విశెష్‌ తెలిపారు. దాదాపు అరగంట సేపు మాట్లాడుకున్నారని, గతానికి సంబంధించి అనుభూతులను గుర్తు చేసుకున్నారని తెలిసింది. ఈ సందర్భంగా రజనీని అజిత్‌ ప్రశంసలతో ముంచేత్తారట. విలక్షణమైన జర్నీని కొనియాడారని తెలుస్తుంది. రజనీకి అజిత్‌ కూడా ఫాలోవర్‌ అని తెలిసిందే.

ప్రస్తుతం రజనీ.. శివ దర్శకత్వంలో `అన్నాత్తై` చిత్రంలో నటిస్తున్నారు. శివ.. అజిత్‌తో `వీరం`, `వేదాలం`, `వివేగం`, `విశ్వాసం` చిత్రాలను రూపొందించిన విషయం తెలిసిందే. ఇక అజిత్‌ ప్రస్తుతం హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో `వాలిమై` సినిమాలో నటిస్తున్నారు. వీరిద్దరు తమిళనాట స్టయిలీష్‌ మాస్‌ హీరోలుగా తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.