Asianet News TeluguAsianet News Telugu

ఫైనల్ గా డైరెక్టర్ ని మార్చేసిన అజిత్!

కోలీవుడ్ హీరో అజిత్ మాత్రం పెద్దగా గ్యాప్ లేకుండా డైరెక్టర్ శివతో సినిమాలు చేస్తూనే ఉన్నాడు. 2014లో  వీరమ్ తో మొదలైన ఈ కాంబో వేదలమ్ - వివేగం అంటూ హ్యాట్రిక్ విజయాల్ని నమోదు చేసుకుంది. 

ajith new project with vinod
Author
Hyderabad, First Published Dec 16, 2018, 5:28 PM IST

సాధారణంగా కాంబినేషన్ అంటే జనాల్లో క్రేజ్ ఓ రేంజ్ లో ఉంటుంది. అప్పట్లో కాంబినేషన్ అంటే బాగానే వర్కౌట్ అయ్యేది. మెయిన్ గా డైరెక్టర్ అండ్  హీరో కాంబో మినిమమ్ హిట్ అన్నట్లు సినిమాలు ఉండేవి. ఇప్పుడు అంచనాలు పెరిగిపోతుండడంతో ఆ ఫార్మాట్ వర్కౌట్ అవ్వడం లేదు. అయితే కోలీవుడ్ హీరో అజిత్ మాత్రం పెద్దగా గ్యాప్ లేకుండా డైరెక్టర్ శివతో సినిమాలు చేస్తూనే ఉన్నాడు. 

2014లో  వీరమ్ తో మొదలైన ఈ కాంబో వేదలమ్ - వివేగం అంటూ హ్యాట్రిక్ విజయాల్ని నమోదు చేసుకుంది. ఇక ఇప్పుడు విశ్వాసం అనే మరో సినిమా రెడీ అవుతోంది. అజిత్ వీరమ్ సినిమా తరువాత గౌతమ్ మీనన్ తో ఒక సినిమా చేశాడు. ఆ తరువాత వరుసగా మూడు సినిమాలు శివతో చేసిన అజిత్ నెక్స్ట్ శివని కొంచెం పక్కనపెట్టి వేరే దర్శకుడితో సినిమా చేయడానికి డిసైడ్ అయ్యాడు. 

ఖాకి సినిమాతో మంచి హిట్ అందుకున్న వినోద్ అజిత్ నెక్స్ట్ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఆ సినిమా బాలీవుడ్ పింగ్ మూవీకి రీమేక్ గా రాబోతోంది. అమితాబ్ నటించిన లాయర్ పాత్రలో అజిత్ ఆకట్టుకోనున్నాడు. ఇకపోతే శ్రీదేవి భర్త బోణి కపూర్ ఆ సినిమాను సొంత ప్రొడక్షన్ లో నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాదిలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. గతంలో శ్రీదేవి నటించిన ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమాలో అజిత్ అతిధి పాత్రలో కనిపించారు

Follow Us:
Download App:
  • android
  • ios