సౌత్ స్టార్ హీరో అజిత్ కుమర్ న్యూ లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. కార్ రేసింగ్ కోసం బెల్జియం వెళ్లిన అజిత్ కుమార్, కొత్త గుండు లుక్‌లో కనిపించి అభిమానులను షాక్‌కు గురి చేశారు. ఇది ఆయన నటిస్తున్న ఏకే 64 లుక్ అవ్వచ్చని ఫ్యాన్స్ అనుమానిస్తున్నారు.
సౌత్ స్టార్ హీరోలలో అజిత్ కుమార్ కూడా ఒకరు. ఈ ఏడాది ఆయన నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరిలో మహిజ్ తిరుమేని దర్శకత్వంలో వచ్చిన 'విడాముయర్చి' సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత రెండు నెలల్లోనే ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చారు అజిత్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ లో విడుదలై 200 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది.
అజిత్ నెక్ట్స్ సినిమా వివరాలు
'గుడ్ బ్యాడ్ అగ్లీ' సక్సెస్ తర్వాత అజిత్ తదుపరి సినిమా 'ఏకే 64'. ఈ సినిమాకు కూడా ఆదిక్ రవిచంద్రనే దర్శకుడు అని తెలుస్తోంది. నవంబర్ లేదా డిసెంబర్ లో షూటింగ్ మొదలవుతుందని కోలీవుడ్ సమాచారం. వేల్స్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఐసరి గణేష్ ఈసినిమాను నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. కెజియఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించబోతున్నట్టు సమాచారం. అయితే ఈ విషయాలను మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
'ఏకే 64' మొదలు పెట్టకముందు అజిత్ కార్ రేసింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది మూడు రేసుల్లో పాల్గొని మూడింటిలోనూ గెలిచారు. ఇప్పుడు యూరప్ లో జరిగే GT4 కార్ రేస్ లో పాల్గొనడానికి బెల్జియం వెళ్లి స్పా ఫ్రాంకోచాంప్స్ సర్క్యూట్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. అజిత్ ఈ రెండేళ్లలో రేసులలో ఎక్కువగా పాల్గొనడంతో..ఆయన ఒక దశలో సినిమాలు వదిలేస్తాడన్న ప్రచారం కూడా జరిగింది. అంతే కాదు అజిత్ సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇస్తాడన్న మరో వాదన కూడా వినిపించింది. ఇలా రకరకాల రూమర్స్ మధ్య అజిత్ 64 సినిమా ఉంటుంది అని సమాచారం బయటకువచ్చింది. కాని అజిత్ కు సబంధించిన తాజా లుక్ ను చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అసలు అజిత్ ఎందుకు ఇలా అయ్యారంటూ చర్చించుకుంటున్నారు.
గుండు చేయించుకున్న అజిత్
అజిత్ కార్ రేసులతో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా దానికి సబంధించి ప్రాక్టీస్ కి వచ్చినప్పుడు తీసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో అజిత్ గుండుతో కనిపించడంతో అభిమానులు షాక్ అయ్యారు. ఇది 'ఏకే 64' సినిమా కోసమా అని అనుమానిస్తున్నారు. 'వేదాళం' తర్వాత ఆయన మళ్ళీ గుండు చేయించుకోవడంతో ఇదే. ఈ లుక్ లో అజిత్ ని గుర్తుపట్టలేకపోతున్నామని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
