అభిమానులు ముద్దుగా తలా అని పిలుచుకునే స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం జరిగింది. అజిత్ తండ్రి పి.సుబ్రహ్మణ్యం (84) నేటి ఉదయం చెన్నైలో మరణించారు.

అభిమానులు ముద్దుగా తలా అని పిలుచుకునే స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం జరిగింది. అజిత్ తండ్రి పి.సుబ్రహ్మణ్యం (84) నేటి ఉదయం చెన్నైలో మరణించారు. కొంతకాలంగా సుబ్రహ్మణ్యం తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయనకి చికిత్స కూడా కొనసాగుతోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కానీ నేడు పరిస్థితి విషమించి ఆయన తుదిశ్వాస విడిచారు. దీనితో అజిత్ కి, అతని కుటుంబానికి సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. చాలా కాలంగా సుబ్రహ్మణ్యం పక్షవాతం, వయసురీత్యా ఏర్పడ్డ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అజిత్ తన తండ్రికి అవసరమైన చికిత్స ఏర్పాట్లు కూడా చేశారు. కానీ ఫలితం లేకపోయింది. తండ్రి మరణంతో అజిత్ తీవ్ర శోకంలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. 

మరికాసేపట్లోనే సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు చెన్నైలోని బసంత్ నగర్ లో జరగనున్నట్లు తెలుస్తోంది. సుబ్రహ్మణ్యం కేరళ పాలక్కాడ్ కి చెందిన వ్యక్తి. కేరళ నుంచి తమిళనాడు వచ్చారు. ఆయన సతీమణి పేరు మోహిని. వీరికి ముగ్గురు కుమారులు అజిత్ కుమార్, అనిల్ కుమార్, అనూప్ కుమార్ సంతానం ఉన్నారు. 

తండ్రిని కోల్పోయిన అజిత్ కి సంఘీభావంగా తలా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సంతాప పోస్ట్ లు పెడుతున్నారు. అజిత్ ధృడంగా ఉండాలని కోరుకుంటున్నారు. తమిళనాట అజిత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యావరేజ్ సినిమాతో అజిత్ వచ్చినా కాసుల వర్షం కురుస్తుంది. నటి సాక్షి అగర్వాల్, ఇతర సినీ ప్రముఖులు సైతం అజిత్ తండ్రి మృతికి సంతాపం తెలుపుతున్నారు.