అజిత్ ఫ్యాన్స్ కు షాక్ ,  ఆయన  హీరోగా నటించిన  గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను నెట్‌ఫ్లిక్స్ నుండి తీసేశారు. ఇళయరాజా ఇచ్చిన కంప్లైంట్  వల్ల నెట్ ప్లిక్ ఈసినిమాను తొలగించింది.  

నెట్‌ఫ్లిక్స్ నుండి గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ తొలగింపు

సౌత్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా వచ్చిన సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఇళయరాజా ఫిర్యాదుతో ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ నుండి తొలగించారు. తన పాటలను అనుమతి లేకుండా సినిమాలో వాడారని ఇళయరాజా ఫిర్యాదు చేయడంతో, మద్రాస్ హైకోర్టు సినిమా ప్రదర్శనను నిషేధించింది.

ఇళయరాజా సంగీతం అందించిన మూడు పాటలను ఈ సినిమాలో వాడారు. 'ఒత్త రూపాయి తారేన్', 'ఎన్ జోడి మంజకురువి', 'ఇళమై ఇదో ఇదో' అనే పాటలను 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో ఉపయోగించారు. దీనిపైనే ఇళయరాజా ఫిర్యాదు చేశారు. రాతపూర్వక క్షమాపణతో పాటు ఐదు కోట్ల రూపాయల నష్టపరిహారం కూడా ఆయన డిమాండ్ చేశారు. కానీ, చట్టప్రకారం పాటల కాపీరైట్స్ ఉన్నవాళ్ల దగ్గర అనుమతి తీసుకున్నామని 'గుడ్ బ్యాడ్ అగ్లీ' నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ వాదించారు. సుదీర్ఘ వాదనల తర్వాత, ఇళయరాజా పాటలతో సినిమాను ప్రదర్శించడాన్ని హైకోర్టు నిషేధించింది. ఈ నేపథ్యంలోనే నెట్‌ఫ్లిక్స్ అజిత్ సినిమాను తొలగించింది.

యాక్షన్ కామెడీ సినిమా

గుడ్ బ్యాడ్ అగ్లీ ఒక యాక్షన్ కామెడీ సినిమా. ఇందులో అజిత్ కుమార్ హీరోగా నటించగా, త్రిష హీరోయిన్‌గా చేసింది. ప్రభు, అర్జున్ దాస్, ప్రసన్న, సునీల్, ఉషా ఉతుప్, రాహుల్ దేవ్, రెడిన్ కింగ్స్‌లీ, ప్రదీప్ కబ్రా, హ్యారీ జోష్, బి.ఎస్. అవినాష్, ప్రియా ప్రకాష్ వారియర్, టిన్ను ఆనంద్, షైన్ టామ్ చాకో కూడా ఇతర పాత్రల్లో నటించారు. అభినందన్ రామానుజం సినిమాటోగ్రాఫర్. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

గుడ్ బ్యాడ్ అగ్లీ కలెక్షన్స్ 

'గుడ్ బ్యాడ్ అగ్లీ' మంచి విజయాన్నే సాధించింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 248.25 కోట్లు వసూలు చేసింది. కేవలం భారతదేశం నుండే రూ. 180.75 కోట్లు సంపాదించింది. విదేశాల నుండి రూ. 67.5 కోట్లు అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా సంపాదించింది.