శోభన్ బాబు మాట వినకుండా నష్టపోయిన హీరోయిన్ ఎవరో తెలుసా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామందికి ఆర్ధికంగా సలహాలు చెప్పిన హీరో శోభన్ బాబు . ఆయన మాట విని ఎంతో మంది కోట్లకు కోట్లు సంపాదించారు. కాని ఆయన మాట వినకుండా నష్టపోయినవారు కూడా ఉన్నారు అందులో ఓ హీరోయిన్ గురించి ఇప్పుడు చూద్దాం.

సోగ్గాడు అందాల నటుడు
ఆంధ్రా అందగాడు, సోగ్గాడు,అందాల నటుడు ఎవరంటే ఎన్నితరాలు మారినా శోభన్ బాబు మాటే వినిపిస్తుంది. తన అభిమానులు తనను హీరోగా మాత్రమే చూడాలని కోరుకున్న శోభన్ బాబు.. 60 ఏళ్ల తరువాత నటనకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆర్ధిక క్రమశిక్షణకు మారుపేరులా నిలిచిన శోభన్ బాబు, తను సినిమాల్లో సంపాదించిన ప్రతీ పైసా భూమిపైనే పెట్టాడు, రియల్ ఎస్టేట్ లో కోట్లు గడించాడు. రియల్ ఎస్టేట్ ద్వారా తన బిజినెస్ ను విస్తరించి దాదాపు 5 వేల కోట్ల వరకూ ఆస్తులు సంపాదించారు.
నటీనటుకు ఆర్ధిక సలహాలు
తన తండ్రి సలహాతో హీరోగా తాను సంపాధించిన ప్రతీ పైసా భూమిపై పెట్టిన శోభన్ బాబు.. తనలా అందరు డబ్బును ఆదా చేయాలని, ఆర్ధికంగా బలపడాలని కోరుకునేవారు. అందుకే తోటి నటీనటులకు తాము సంపాధించిన డబ్బుతో అంతో ఇంతో భూమి కొనుగోలు చేయండి అనిచెప్పేవారు. అడివిలో ఉన్నా కూడా భూమి భూమే.. అది ఎప్పటికైనా రేటు వస్తుంది అనేవారు. అలా ఆయన సలహా విన్నవారు ప్రస్తుతం కోటీశ్వరులుగా ఉన్నారు. ఉదాహరణకు మురళీమోహన్ తాను సినిమాల్లో సంపాధించిన డబ్బును రియల్ ఎస్టేట్ లో పెట్టారు. జయభేరి కంపెనీ ద్వారా తక్కువ రేటులో మధ్యతరగతి వారికి ప్లాట్స్ అందుబాటులోకి తెచ్చిన మురళీ మోహన్.. కోట్లు సంపాధించారు.
నష్టపోయిన హీరోయిన్లు
శోభన్ బాబు సలహా విని మురళీ మోహన్ తో పాటు చంద్రమోహన్ లాంటి ఎంతో మంది నటులు కోట్లు సంపాధించారు. కాని శోభన్ బాబు సలహా వినకుండా నష్టపోయిన వారు చాలామంది ఉన్నారు. తాను ముందు కళ్లు తెరవలేకపోయానని, శోభన్ బాబు చెప్పినట్టు విని ఉంటే బాగుండేదని అలనాటి హీరోయిన్ ఊర్వశి శారద ఓ ఇంటర్వ్యులో వెల్లడించారు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వూలో మాట్లాడుతూ.. తాను వ్యాపారం ద్వారా చాలా నష్టపోయానని.. చాలా ఆస్తులు పోగోట్టుకున్నాని అన్నారు. శోభన్ బాబు సలహాతో చాలామంది బాగుపడ్డారు, కాని నేను వ్యాపారం చేసి నష్టపోయాను అన్నారు.
మంచి చేయాలని
నలుగురికి మంచి చేయాలని తపన తనకు అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది అన్నారు శారద. అప్పట్లో తాను పెట్టిన లోటస్ కంపెనీ కూడా తనకు ఆర్ధికంగా సహాయంగా ఉంటుంది, మహిళలకు ఉపాధి కల్పించినట్టు అవుతుంది అన్న ఉద్దేశ్యంతోనే నడిపానన్నారు శారద. దాని వల్ల ఆస్తి పోగోట్టుకున్నాను. కాని ఇప్పుడు ఉన్నదాంటో సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నాను అన్నారు శారద. ఇప్పటికీ కళ్లు లేనివారికి , ముఖ్యంగా ఆడవారికి ఏదో ఒకటి చేయాలని చూస్తున్నట్టు శారద చెప్పుకొచ్చారు. ఇలా శోభన్ బాబు సలహా వినకుండా శారద, జయసుధ లాంటి హీరోయిన్లు కొంత మంది నష్టపోయినట్టు పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు.