నటి కస్తూరి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. గతంలో 'భారతీయుడు', 'అన్నమయ్య' వంటి సినిమాల్లో నటించిన ఆమె ఇటీవల అజిత్ ఫ్యాన్స్ పై కొన్ని కామెంట్స్ చేసింది. కస్తూరి.. అజిత్ ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ 'తలైవలి'(తలనొప్పి) అని కామెంట్ చేసింది.

అసలే అజిత్ ఫ్యాన్స్ అతడిని దైవంగా ఆరాధిస్తుంటారు. అలాంటిది కస్తూరి చేసిన కామెంట్ కి ఊరుకుంటారా..? ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. బహిరంగ క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

కస్తూరిని బెదిరిస్తూ కొన్ని వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. నిజానికి కస్తూరి.. అజిత్ పై ఏమైనా కామెంట్ చేయలన్నా.. ఆయన అభిమానులు తలనొప్పిలా మారారనే ఉద్దేశంతో అటువంటి ట్వీట్ చేసింది. ఇప్పుడు రెచ్చిపోతున్న అజిత్ ఫ్యాన్స్ ఆగడాలను అరికట్టడానికి కస్తూరి కోసం ఓ ఆర్మీ తయారైంది.

సోషల్ మీడియాలో కస్తూరికి మద్దతునిస్తూ.. 'డర్టీ అజిత్ ఫ్యాన్స్' అనే హ్యాష్ ట్యాగ్ తో కస్తూరికి సపోర్ట్ చేస్తున్నారు. 'వి లవ్ అండ్ సపోర్ట్ కస్తూరి శంకర్' అంటూ ఆమెకి ధైర్యాన్నిస్తున్నారు.

గతంలో కూడా తమిళంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్న సందర్భాలు ఉన్నాయి. స్టార్ హీరో విజయ్ ఫ్యాన్స్ ఓ సీనియర్ జర్నలిస్ట్ ని ఇలానే ఇబ్బంది పెట్టారు. ఇప్పటికైనా హీరోలు తేరుకొని అభిమానులను కంట్రోల్ చేస్తే పరిస్థితి ఓ కొలిక్కి వస్తుంది. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పేలా లేవు.