తమిళ అగ్ర హీరో అజిత్ నటించిన 'విశ్వాసం' సినిమా జనవరి 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసింది. మరో పక్క అజిత్ ఫ్యాన్స్ వేడుకలు చేసుకోవడం మొదలుపెట్టేశారు.

ఈ క్రమంలో అజిత్ ఫ్యాన్స్ లో కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు విషయంలోకి వస్తే.. సినిమా విడుదల సందర్భంగా అజిత్ కటౌట్ లు, పోస్టర్లు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు అభిమానులు. థేని జిల్లాలోని కొడువిలర్పట్ గ్రామంలో అతికించిన ఓ పోస్టర్ ని చింపేశారు.

దీంతో అజిత్ అభిమానులకు, పోస్టర్ అతికించిన ప్రదేశంలో నివసిస్తున్న ఇంటి యజమాని జయమనికి మధ్య గొడవ మొదలైంది. అభిమానులు యజమానిని దూషించి, చంపుతామని బెదిరించారట.

దీంతో జయమని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాలమురుగన్, అజిత్ కుమార్, విజయ్, సెల్వకుమార్ లతో పాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక సినిమా విషయానికొస్తే.. శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది.