కోలీవుడ్ లో రజినీకాంత్ తరువాత ఆ స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోల్లో అజిత్ కూడా ఒకరు. ఒక సినిమాతో మినిమమ్ 100కోట్ల బిజినెస్ చేసే గ్యారెంటీ ఉన్న హీరో. అయితే ప్రస్తుతం స్టార్ దర్శకులతో కమర్షియల్ కథలు రెడీగా ఉన్నప్పటికీ గతంలో శ్రీదేవికి ఇచ్చిన మాటకు కట్టుబడి బోణి కపూర్ ప్రొడక్షన్ లో పింక్ రీమేక్ లో నటించాడు. 

ఆ సినిమా ఇటీవల తమిళ్ లో రిలీజై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇకపోతే ఈ సినిమా తరువాత ఒక కోలీవుడ్ దర్శకుడి ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తేవాలని అనుకున్న అజిత్ ని బోణి కపూర్ మళ్ళీ లాగేశాడు. నెక్స్ట్ సినిమా కూడా మళ్ళీ తమ ప్రొడక్షన్ లోనే స్టార్ట్ చేయాలనీ చెప్పడంతో అజిత్ కాదనలేకపోయాడు. 

తన ప్రాజెక్టులన్నీ పక్కనపెట్టేశాడట. స్పోర్ట్స్ రేజింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న సినిమాలో అజిత్ ని మాస్ ఆడియెన్స్ కి నచ్చేలా బోణి కపూర్ స్క్రిప్ట్ రెడీ చేయించినట్లు సమాచారం. ఇక ఆ ప్రాజెక్ట్ ఈ నెల 29న మొదలుకానుంది. అంతే కాకుండా బాలీవుడ్ లో కూడా సినిమా రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.