కోలీవుడ్ లో ఎంత మంది స్టార్ హిరోలున్నా అజిత్ కి ఉండే క్రేజ్ డిఫెరెంట్ గా ఉంటుందని చెప్పవచ్చు. కమర్షియల్ సినిమాలతో ఫ్యాన్స్ కి ప్రతిసారి సరికొత్తగా కిక్కిచ్చే థలా అజిత్ ఇప్పుడు మరో బాలీవుడ్ రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. రీసెంట్ గా నేర్కొండ పార్వైగా అజిత్ సక్సెస్ అందుకున్నాడు. 

ఆ సినిమా బాలీవుడ్ పింక్ చిత్రానికి రీమేక్ గా వచ్చింది. అలాగే నెక్స్ట్ బోణి కపూర్ ప్రొడక్షన్ లోనే అజిత్ ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయనున్నాడు. అదే విధంగా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి లాభాలను అందించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'ఆర్టికల్ 15' సినిమాపై కూడా అజిత్ ఇంట్రెస్ట్ చూపించినట్లు టాక్. 

రీసెంట్ గా ఆ సినిమా తమిళ్ రీమేక్ రైట్స్ ను బోణి కపూర్ దక్కించుకున్నారు. దీంతో ఆ ప్రాజెక్ట్ ను తప్పకుండా అజిత్ తోనే చేస్తారని బాలీవుడ్ మీడియాలో కథనాలు మొదలయ్యాయి. బోణి కపూర్ లో ప్రస్తుతం చేస్తున్న సినిమా అయిపోగానే వీలైనంత త్వరగా అజిత్ మరో రీమేక్ ని స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.