విలన్ గా సహనటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్. అప్పుడప్పుడు సినిమాల్లో కథానాయకుడి పాత్రలు కూడా చేస్తున్నాడు. త్వరలోనే ఆయన ఒక డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

మైండ్ రీడర్ లవ్ రివెంజ్ స్టోరీ కాన్సెప్ట్ తో వస్తోన్న స్పెషల్ అనే సినిమాలో అజయ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ప్రేమించిన అమ్మాయి మోసం చేయడానికి కారణమైన వారిని తెలుసుకొని మైండ్ రీడర్ వారిని ఎలా అంతం చేశాడు అనేది సినిమా కథ అని దర్శకుడు వాస్తవ్ తెలిపాడు. 

అదే విధంగా గజిని, పిజ్జా, సెవెన్త్ సెన్స్, కాంచన, అపరిచితుడు వంటి మూవీస్ ని తలపించే విధంగా మంచి కథాంశంతో తెరకెక్కించినట్లు తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న స్పెషల్ మూవీ టీజర్ ను ఈ నెల 29న రిలీజ్ చేయనున్నట్లు తెలుపుతూ.. సినిమాను నవంబర్ చివరి వారంలో వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్లు తెలియజేశారు.