స్వాతంత్య్ర దినోత్స‌వ కానుకగా మైదాన్ ను ఆగస్ట్ 13, 2021న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించారు. ప్రతీ భారతీయుడు గర్వపడేలా ఈ చిత్రం ఇతివృత్తం ఉంటుందని నిర్మాత బోనీ కపూర్ ప్రకటించారు.

భారత ఫుట్ బాల్ ను ప్రపంచానికి పరిచయం చేసిన కోచ్ యధార్థ కథ ఆధారంగా స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న చిత్రం `మైదాన్`. ఫుట్ బాల్ కోచ్ గా అజయ్ దేవగన్ నటిస్తోన్న ఈ సినిమాను క్రీడా నేపథ్యంలో ఒక ఇన్నిపిరేషనల్‌గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్‌లో భాగంగా రిలీజ్ చేసిన పోస్టర్స్‌కు మంచి రెస్సాన్స్ వస్తోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

స్వాతంత్య్ర దినోత్స‌వ కానుకగా మైదాన్ ను ఆగస్ట్ 13, 2021న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించారు. ప్రతీ భారతీయుడు గర్వపడేలా ఈ చిత్రం ఇతివృత్తం ఉంటుందని నిర్మాత బోనీ కపూర్ ప్రకటించారు.

నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి, బధాయి హో ఫేమ్ గజరాజ్ రావు, పాపులర్ బెంగాలీ యాక్టర్ రుద్రనిల్ ఘోష్ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్న మైదాన్ ని ఫ్రెష్‌లైమ్ ఫిల్మ్‌ సహకారంతో జీ స్టూడియోస్ బేన‌ర్‌పై బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరునవ జాయ్ సేన్ గుప్తా నిర్మిస్తున్నారు. బధాయి హో వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఏ ప్లాట్‌ఫాంలో రిలీజ్ చేస్తున్నారు అన్న విషయాన్ని మాత్రం చిత్రయూనిట్‌ వెల్లడించలేదు.