Asianet News TeluguAsianet News Telugu

అజయ్ దేవగణ్ కు కువైట్ ప్రభుత్వం షాక్, ఆయన సినిమాపై నిషేదం

అసలే ఇబ్బందుల్లో ఉన్న బాలీవుడ్ కు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. బాయ్ కాట్ బాలీవుడ్  ట్రెండ్ నడుస్తుండగానే.. బాలీవుడ్ మరో సినిమాకు ఎదురు దెబ్బ తగిలింది. కాని అది ఇక్కడ కాదు ఫారెన్ లో. అజయ్ దేవగణ్ కు కువైట్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 

Ajay Devgn thank god movie banned in kuwait
Author
First Published Sep 18, 2022, 6:51 AM IST

చాలా కాలంగా బాలీవుడ్ లో సినిమాలకు గ్రహణం పట్టినంత పని అవుతోంది. బాలీవుడ్ సినిమాలను ఆడియన్స్ బాయ్ కాట్ చేస్తుండటం, పెద్ద సినిమాలేవి సరిగ్గ ఆడక ఫెయిల్యూర్ బాట పడుతుండటంతో.. బాలీవుడ్ లో ఎవరికి ప్రశాంతత లేకుండా పోయంది. అయినా సరే వారి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు. సరిగ్గా ఇదే టైమ్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన బ్రహ్మాస్త్రా కాస్ ఊరటనిచ్చిందనుకోవాలి. అది కూడా రాజమౌళి హ్యాండ్ పడబట్టే ఈ కాస్త అయినా సక్సెస్ అయ్యిందన్నది అందరికి తెలిసిందే. 

ఇక మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అసలే కస్టాల్లో కొట్టుమిట్టాడుతున్న బాలీవుడ్ సినిమాకు మరో షాక్ తగిలింది. అజయ్ దేవగణ్ నటించిన్ థాంక్ గాడ్ సినిమాకు కువైట్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈసిసినిమాను అనుమతించేది లేదంటూ అక్కడి ఫిల్మ్ బోర్డ్ ఖచ్చితంగా చెప్పేసింది.  మత విశ్వాసాలను దెబ్బ తీసేలా సినిమా ట్రైలర్ ఉందనే కారణంతో ఈ చిత్రంపై అక్కడి సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమాపై నిషేధం విధించింది. 

ఇక ఈ సినిమాలోని అభ్యంతరకరమైన సన్నివేశాన్ని తీసేస్తే... సినిమా విడుదలకు అనుమతిస్తామని తెలిపింది. ఈ సినిమా ఫాంటసీ కామెడీగా తెరకెక్కింది. ఈ సినిమాలో  చిత్రగుప్తుడిగా అజయ్ దేవగణ్ కనిపిస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలను పోషించారు. ఫోన్ మాట్లాడుతూ కారు నడిపిన  సిద్థార్థ్ యాక్సిడెంట్ లో చనిపోయి నరకానికి వెళ్తాడు. అక్కడ  చిత్రగుప్తుడిగా ఉన్న అజయ్ దేవగన్ సిద్థార్డ్ చేత ఓఆట ఆడిస్తాడు. ఇలా ఫాంటసీ కథతో.. డిఫరెంట్ గా.. కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈసినిమా  అక్టోబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. మరి చూడాలి కువైట్ కోసం ఈ సినిమాలో ఎలాంటి మార్పులు చేస్తారో...? 

Follow Us:
Download App:
  • android
  • ios