దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో చూశాం. రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ అల్లూరి, కొమరం భీం పాత్రల్లో అద్భుతంగా నటించారు.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో చూశాం. రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ అల్లూరి, కొమరం భీం పాత్రల్లో అద్భుతంగా నటించారు. రాంచరణ్ పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ అందించగా.. ఎన్టీఆర్ ఎమోషనల్ గా కట్టి పడేశాడు.
ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్.. రాంచరణ్ తండ్రిగా పవర్ ఫుల్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. పోరాట యోధుడిగా అజయ్ దేవగన్ 'లోడ్ ఎయిమ్ షూట్' అంటూ పవర్ ఫుల్ గా, ఎమోషనల్ గా అదరగొట్టారు. అజయ్ దేవగన్ పాత్ర చిన్నదే అయినప్పటికీ చాలా ఇంపాక్ట్ చూపించింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అజయ్ దేవగన్ మాట్లాడుతూ.. తాను ఇంకా ఆర్ఆర్ఆర్, గంగూబాయి చిత్రాలు చూడలేదని అన్నారు. అంతే కాదు తన సతీమణి కాజోల్, షారుఖ్ ఖాన్ ల ఐకానిక్ మూవీ ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే' కూడా ఇంకా చూడలేదని అన్నారు.
సినిమాలని పెద్దగా చూడను. ఇక నేను నటించిన సినిమాలని కూడా కుదిరితే వెంటనే చూసేస్తా. లేకుంటే అసలు చూడను. ఎందుకంటే బాగా ఆలస్యం అయ్యాక ఆ సినిమాలు చూస్తే.. అరె.. ఇంకా బాగా నటించి ఉండాల్సింది అనే ఫీలింగ్ కలుగుతుంది. సంతృప్తి ఉండదు అని అజయ్ దేవగన్ అన్నారు.
ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయంగా నిలిచింది. 100ఓ కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అలియా భట్, సముద్ర ఖని ఇతర పాత్రల్లో నటించారు.
