బాలీవుడ్ ప్రముఖ హీరో అజయ్ దేవగన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి, ప్రముఖ స్టంట్ డైరెక్టర్ వీరు దేవగన్ సోమవారం నాడు మృతి చెందారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ముంబైలోకి సూర్య హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.

దాదాపు ఎనభైకి పైగా బాలీవుడ్ చిత్రాలకు స్టంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసిన ఆయన నిర్మాతగా, నటుడిగా కూడా కొన్ని సినిమాలు చేశారు.

అంతేకాదు.. అజయ్ దేవగన్ ని హీరోగా పెట్టి 'హిందుస్థాన్ కీ కసమ్' అనే సినిమాను డైరెక్ట్ చేశారు. ఆయన మరణవార్త విన్న సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.