Asianet News TeluguAsianet News Telugu

రివ్యూలు సూపర్బ్..కానీ కలెక్షన్స్ మాత్రం అంత దారుణమా? తేడా ఎక్కడ

మైదాన్ అద్భుతంగా ఉందంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ స్పోర్ట్స్ డ్రామా ఎమోషనల్‍గా, ఎంగేజింగ్‍గా ఉందంటూ ప్రశంసలు కురిపించారు.

Ajay devgn Maidaan struggled to attract the audience jsp
Author
First Published Apr 13, 2024, 11:37 AM IST


భారత దిగ్గజ ఫుట్‍బాల్ కోచ్, హైదరాబాదీ లెజెండ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా బాలీవుడ్ మూవీ ‘మైదాన్’ వచ్చిన సంగతి తెలిసిందే ఈ చిత్రంలో హీరో అజయ్ దేవ్‍గన్ ప్రధాన పాత్ర పోషించారు. ప్రియమణి కూడా ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించారు. ఈ స్పోర్ట్స్ బయోపిక్ మూవీకి అమిత్ శర్మ దర్శకత్వం వహించారు. మైదాన్ సినిమా ఏప్రిల్ 11వ తేదీన ఈద్ సందర్భంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. కాగా, ఈ సినిమాకి అదిరిపోయే స్దాయిలో పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. మీడియా మొత్తం మెచ్చుకుంటోంది. మరి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి.

మైదాన్ సినిమా ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లలో రిలీజ్ కావటానికి ముందే  ప్రీమియర్ల ద్వారా కొందరు క్రిటిక్స్, సెలెబ్రిటీలకు ప్రీమియర్ షోలు వేశారు మేకర్స్. ఈ చిత్రం చూసిన వారి దగ్గరి నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మైదాన్ అద్భుతంగా ఉందంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ స్పోర్ట్స్ డ్రామా ఎమోషనల్‍గా, ఎంగేజింగ్‍గా ఉందంటూ ప్రశంసలు కురిపించారు. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనూ చాలా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో మైదాన్ భారీ వసూళ్లను సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అయితే అవన్నీ పేక మేడల్లా కూలిపేయేలా కనపడుతున్నాయి. 

 ఇటీవల ‘షైతాన్’ సినిమాతో అజయ్ దేవగన్ భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. దీని తర్వాత విడుదలవుతున్న సినిమా కావడంతో ‘మైదాన్’ సినిమాపై అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే రిలీజ్ కు ముందు స్పెషల్ ప్రీమియర్ షోస్ కూడా పడ్డాయి. రివ్యూస్ కూడా పాజిటివ్ గానే వస్తున్నాయి. అయితే ఇంతలోనే భాక్సాపీస్ మాత్రం  చిత్ర టీమ్ కి షాక్ ఇచ్చింది. రివ్యూలకు సినిమా కలెక్షన్స్ కు సంభందం లేకుండా పోయింది.

బాలీవుడ్ ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా పెయిడ్ ప్రివ్యూ  కలెక్షన్స్ తో కలిపి ₹7.1 కోట్లు వచ్చాయి.  గురువారం ఈ సినిమా 40% డ్రాప్ కనపడింది. శుక్రవారం  ₹2.5 కోట్లు వచ్చింది. రెండో రోజుకే ఈ రేంజ్ డ్రాప్ కనపడటంతో ట్రేడ్ కంగారుపడుతోంది. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే  నాలుగు రోజుల వీకెండ్ 12-13 కోట్లు మాత్రమే వస్తాయని అంచనా. అంటే ఈ కలెక్షన్స్ చాలా పూర్ గా ఉన్నట్లు లెక్క. అంటే మొత్తం మీద 30 కోట్లు మాత్రమే వసూలు చేయగలదు. అంటే ఫిల్మ్ బడ్జెట్ 100 కోట్లు అనుకుంటే కనుక సినిమా థియేటర్ వైజ్ లాస్ లో ఉన్నట్లు లెక్క. అయితే ఓటిటి రైట్స్ తో నిర్మాత బయిటపడే అవకాసం ఉంది. అయితే లాభాలు మాత్రం కష్టం. పెద్ద డిజాస్టర్ క్రింద లెక్క అంటున్నారు.  

ఈ సినిమా రిలీజ్ కు ముందే ఈ సినిమాకు షాక్ తగిలింది. అమిత్ శర్మ దర్శకత్వం వహించిన ఈ స్టోర్ట్స్ డ్రామాకు ఆఖరి నిమిషంలో ఎదురుదెబ్బ తగిలింది. మైదాన్ సినిమా రిలీజ్ పై కోర్టు స్టే విధించింది. ఈ సినిమా కథ తనదేనంటూ మైసూర్ కు చెందిన కథా రచయిత అనిల్ కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో మైసూరు కోర్టు మైదాన్ రిలీజ్ పై స్టే విధించింది. 

‘2018లో, నేను లింక్డ్‌ఇన్‌లో ఈ సినిమా కథ గురించి పోస్ట్ చేసాను. సుక్దాస్ సూర్యవంశీ అనే వ్యక్తి తో ఈ కథను చర్చించారు. నేను ఫిబ్రవరి 2019లో నా పేరు నమోదు చేసుకున్నాను. ఇప్పుడు నా అసలు కథ ను కాపీ చేసి మైదాన్ అని పేరు పెట్టారు. మైసూరు కోర్టులో నాకు న్యాయం జరిగింది’ అని మైసూర్‌లోని ఫిర్యాదుదారు కిరణ్ కుమార్ అన్నారు.  అమిత్ శర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘మైదాన్’. జియో స్టూడియోస్, బోనీకపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అజయ్ దేవగన్, ప్రియమణి తదితరులు నటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios