యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సత్తాని పూర్తి స్థాయిలో తెలుగు వారికి పరిచయం చేసిన చిత్రం ఖైదీ. కార్తీ హీరోగా నటించిన ఈ చిత్రం తమిళ తెలుగు భాషల్లో ఘనవిజయం సాధించింది.
యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సత్తాని పూర్తి స్థాయిలో తెలుగు వారికి పరిచయం చేసిన చిత్రం ఖైదీ. కార్తీ హీరోగా నటించిన ఈ చిత్రం తమిళ తెలుగు భాషల్లో ఘనవిజయం సాధించింది. గత ఏడాది విడుదలైన విక్రమ్ చిత్రంతో లోకేష్ కనకరాజ్ సౌత్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయారు.
ఇటీవల రీమేక్ చిత్రాలు వర్కౌట్ కావడం లేదు. కానీ సౌత్ చిత్రాలపై బాలీవుడ్ హీరోలు ఓ కన్నేసి ఉంచుతున్నారు. ఇటీవల షెహజాదాగా హిందీలో రీమేక్ అయిన అల వైకుంఠపురములో చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. కానీ రీమేక్ చిత్రాలు బాలీవుడ్ లో ఆగడం లేదు.
సీనియర్ స్టార్ హీరో అజయ్ దేవగన్ హిందీలో ఖైదీ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అజయ్ దేవగన్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం 'భోళా' అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. ఇది రీమేక్ చిత్రం అయినప్పటికీ అజయ్ దేవగన్ ఊహించని షాక్ ఇచ్చారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా అమలాపాల్ నటిస్తోంది. వరిజినల్ వర్షన్ లో కార్తీకి అసలు హీరోయిన్ ఉండదు.
కథలో భాగంగా అతడికి భార్య ఉండేది అని మాత్రమే చెబుతారు. అతడి భార్యని అసలు చూపించరు. కార్తీ ఢిల్లీ పాత్రకి సంబందించిన బ్యాక్ స్టోరీని ప్రీక్వెల్ లో చూపించాలని లోకేష్ కనకరాజ్ అనుకున్నారు. కానీ హిందీ రీమేక్ లో అజయ్ దేవగన్ అమలాపాల్ ని హీరోయిన్ గా పెట్టడమే కాదు ఆమెతో రొమాంటిక్ డ్యూయెట్స్ కూడా పెట్టేశారు. తాజాగా ఈ చిత్రంనుంచి ఒక సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ లో అజయ్ దేవగన్ తన గ్యాంగ్ ని వెంటబెట్టుకుని అమలాపాల్ వెంట పడుతుంటాడు.

చూస్తుంటే అజయ్ దేవగన్ ఖైదీ చిత్రానికి చాలా మార్పులే చేసినట్లు అనిపిస్తోంది. హిందీ నేటివిటీ పేరుతో అతిగా మార్పులు చేసి కథని చెడగొడతారా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఖైదీ చిత్రం హీరోయిన్ ప్రస్తావన లేకుండా ఒక ఫ్లోలో సాగిపోతుంది. మరి భోళాలో అజయ్ దేవగన్ చేస్తున్న ప్రయోగాలు ఆయనకే తెలియాలి. ఈ చిత్రం మార్చి 30న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.
