బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ ప్రతి విషయంలో విభిన్నంగా ఆలోచిస్తుంటాడు. అజయ్ దేవగన్ నటించే చిత్రాలు కూడా విభిన్నంగానే ఉంటాయి. ఇటీవల అజయ్ దేవగన్ నటించిన దే దే ప్యార్ దే చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో సీనియర్ నటి టబు, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. 

తాజాగా అజయ్ దేవగన్ వార్తల్లో నిలిచాడు. అజయ్ దేవగన్ తాజాగా రోల్స్ రాయల్ లోని అత్యంత ఖరీదైన మోడల్ కలినిన్ ఎస్.యూ.వి కారుని కొనుగోలు చేశాడు. ఈ కారు ధర ఏకంగా రూ. 6.95 కోట్లు. ఇండియాలో ఇంతటి ఖరీదైన కారుని ఉపయోగించే మూడో వ్యక్తిగా అజయ్ దేవగన్ అవతరించాడు. 

ఇంతటి ఖరీదైన కార్లని ఇప్పటివరకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ లు మాత్రమే ఉపయోగిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి అజయ్ దేవగన్ చేరాడు. అజయ్ కి కొత్త మోడల్ కార్లంటే చాలా ఇష్టం. అతడివద్ద ఇప్పటికే బీఎండబ్ల్యూ 5 సిరీస్, రేంజ్ రోవర్, ల్యాండ్ రోవర్, మెర్సిడిజ్ బెంజ్ లో రెండు మోడల్స్, టొయోట కార్లు ఉన్నాయి. 

అజయ్ దేవగన్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు మైదాన్ అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు.