ఆర్ఎక్స్ 100 సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న యువ దర్శకుడు అజయ్ భూపతి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తేవడానికి గత కొంత కాలంగా కష్టపడుతున్నాడు. క్రైమ్ నేపథ్యంలో మహాసముద్రం అనే ఒక కాన్సెప్ట్ ను సెట్ చేసుకున్న అజయ్ ఎంతో మంది హీరోలకు కథను చెప్పినట్లు రూమర్స్ వచ్చాయి. 

రవితేజ మహాసముద్రం ప్రాజెక్ట్ లో సెట్టయినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ఫైనల్ గా ఆ ప్రాజెక్ట్ నుంచి రవితేజ తప్పుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై అజయ్ క్లారిటీ ఇచ్చాడు. కానీ నెక్స్ట్ ఎవరితో ఆ ప్రాజెక్ట్ చేస్తాడు అనే విషయాన్నీ మాత్రం చెప్పలేదు. త్వరలోనే తన రెండవ సినిమాపై క్లారిటీ ఇస్తానని దర్శకుడు వివరణ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వస్తోంది. 

అసలైతే మొదట మహాసముద్రం ప్రాజెక్ట్ కోసం సిద్దార్థ్ ని సెలెక్ట్ చేసుకున్నట్లు న్యూస్ వచ్చింది. రాశి ఖాన్ హీరోయిన్ అని జెమిని కిరణ్ సినిమాని నిర్మించేందుకు సిద్దమైనట్లు టాక్ వచ్చింది. అనంతరం నాగ చైతన్య - బెల్లంకొండ శ్రీనివాస్ కూడా సినిమాపై ఇంట్రెస్ట్ చూపించినట్లు రూమర్స్ వచ్చాయి. ఫైనల్ గా రవితేజ కూడా తప్పుకున్నట్లు తెలియడంతో సినిమాలో ఎవరు నటిస్తారు అనేది సప్సెన్స్ గా మారింది.