దర్శకులు హీరోలు కావటం వింతేమీ కాదు. అప్పట్లో భాగ్యరాజా తన సినిమాలు తనే డైరక్ట్ చేసుంటూ ఉండేవారు. పెద్ద హిట్ సినిమాలు ఇచ్చారు. హీరోలు అందుబాటులో లేనప్పుడు దమ్మున్న డైరక్టర్ తన కథను నమ్మి చేసే పని ఇది. అలాగే ఇప్పుడు ప్రముఖ నిర్మాత వివి వినాయిక్ సైతం హీరోగా పరిచయం అవుతూ ఓ సినిమా చేస్తున్నారు. ఈ నేపధ్యంలో తను  మాత్రం నటుడుగా ఎందుకు ట్రై చేయకూడదు అనుకున్నట్లు ఉన్నారు  'ఆర్ఎక్స్ 100'డైరక్టర్.

'ఆర్ఎక్స్ 100' సినిమాతో మంచి హిట్ ని  అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి. ఆయన గత కొంతకాలంగా  రెండవ సినిమాగా  'మహాసముద్రం' అనే టైటిల్ తో సినిమా చేద్దామని స్క్రిప్టు రాసుకుని సినిమా చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రకరకాల కారణాలతో ముందుకు వెళ్లటం లేదు.  

వేర్వేరు హీరోలను ఎప్రోచ్ అయినా ఫలితం కనపడలేదు. రీసెంట్ గా రవితేజ సైతం ఈ ప్రాజెక్టు ఓకే చేసినట్లు చేసి, చివరలో హ్యాండ్ ఇచ్చాడు. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో తనే కీ రోల్ లో చేయాలని అజయ్ భూపతి నిర్ణయానికి వచ్చినట్లు ఓ ఆంగ్ల దిన పత్రిక కథనం రాసుకొచ్చింది. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది అజయ్ భూపతి చెప్తే గాని తెలియదు.
 
మరో ప్రక్క నాగచైతన్యకు ఈ కథ చెప్పారని, సమంత కూడా ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపిస్తోందని వినికిడి. ఈ సినిమాలో ఇద్దరు హీరోలకు ఛాన్స్ ఉందిట. దాంతో  ఆయన ఆజయ్ భూపతి చేయబోయే   యాక్షన్ స్క్రిప్ట్ 'మహాసముద్రం'లో చైతు, అజయ్ భూపతి కనపడతారేమో చూడాలి.