Aishwarya Rajinikanth : కూతురు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న రజినీకాంత్.. ఐశ్వర్య ఎమోషనల్ కామెంట్స్
కూతురు ఐశ్వర్య ‘లాల్ సలామ్’ ఈవెంట్ లో మాట్లాడిన మాటలకు తండ్రి రజనీకాంత్ కన్నీళ్లు పెట్టుకున్నారు. రజనీపై వచ్చిన ట్రోల్స్ పై స్పందించిన ఆమె ఎమోషనల్ గా మాట్లాడారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ Rajinikanth కూతురు ఐశ్వర్య రజనీకాంత్ Aishwarya Rajinikanth దర్శకత్వంలో ‘లాల్ సలామ్’ Lal Salaam చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రజనీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొన్న ఈ సినిమా వచ్చే నెలలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్ ను ప్రారంభించారు.
ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నిన్న చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. కార్యక్రమానికి రజనీకాంత్ కూడా హాజరయ్యారు. వేడుకలో ఐశ్వర్య స్పీచ్ ఆసక్తికరంగా మారింది. రీసెంట్ గా రజనీపై, తన కుటుంబంపై వచ్చిన ట్రోల్స్ కు ఆమె స్పందించారు. ఎమోషనల్ అయ్యారు. ఆమె మాట్లాడుతూ.. ‘అమ్మాయికి కష్టం వస్తే తండ్రి డబ్బు ఇస్తారు.. కానీ మానాన్న మాత్రం నాకు సినిమా ఇచ్చారు. సోషల్ మీడియాకు సాధారణంగా నేను దూరంగా ఉంటాను. కానీ నా టీమ్ నెట్టింట వచ్చిన నెగెటివిటీని చెబుతూ వచ్చారు..
ఆ సమయంలో బాధనిపించింది. కొన్ని సందర్భాల్లో కోపం కూడా వచ్చింది. ఎందుకంటే మేం కూడా మనుషులమే కదా.. మాకూ భావోద్వేగాలు ఉంటాయి కాదా.. ఇటీవల నా తండ్రిని సంఘీ అని పిలుస్తున్నారు. పొలిటికల్ పార్టీకి మద్దతు ఇచ్చే వారిని అలా పిలుస్తారని తెలిసింది. ఆయన సంఘీ కాదనేది గుర్తుంచుకోండి. అలా అయితే ఆయన లాల్ సలామ్ ముస్లిం పాత్ర చేసేవారు కాదు. ఆయన మానవతావాది మాత్రమే..’ అంటూ తన మనస్సులోని మాటలను బయటపెట్టారు.
వేదికపైన ఐశ్వర్య మాటలకు రజనీకాంత్ ఎమోషనల్ అయ్యారు. కూతురు అలా మాట్లాడటంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో ప్రస్తుతం ఆమె కామెంట్స్ మరింతగా వైరల్ అయ్యాయి. ఇక ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో వస్తున్న లాల్ సలామ్ చిత్రం ఫిబ్రవరి 9న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం విశేషం. చిత్రంలో హీరోలు విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.