కోలీవుడ్ నటి ఐశ్వర్యారాజేష్ మొదటి నుండి కూడా సరికొత్త కథలను ఎన్నుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది. 'కాక్కాముట్టై' చిత్రంలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించిన ఆమె 'నమ్మ వీట్టు పిళ్లై' సినిమాలో శివ కార్తికేయన్ కి చెల్లెలిగా కనిపించింది మెప్పించింది.

అయితే కమల్ హాసన్ తో 'ఇండియన్ 2' సినిమాలో నటించే ఛాన్స్ వదులుకుంది ఈ బ్యూటీ. ఆ విషయం తనను చాలా రోజులు బాధించిందని చెబుతోంది ఈ భామ. శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఇండియన్‌–2 చిత్రంలో నటించే అవకాశం వచ్చిన విషయం నిజమేనని చెప్పిన ఐశ్వర్య.. సినిమా కోసం గత డిసెంబర్‌లో కాల్‌షీట్స్‌ అడిగారని.. ఆ విధంగా కాల్‌షీట్స్‌ కేటాయించానని, అయితే ఆ చిత్రం షూటింగ్‌ వాయిదా పడి ఈ ఏడాది ఆగస్ట్‌ నెలలో ప్రారంభమైందని.. వేరే సినిమాలకు కాల్షీట్స్ కేటాయించడంతో.. 'ఇండియన్ 2'కి డేట్స్ ఇవ్వలేకపోయాయని చెప్పుకొచ్చింది. క

మలహాసన్‌ వంటి నటుడు, శంకర్‌ వంటి దర్శకుడు కాంబినేషన్‌లో నటించే అవకాశాన్ని వదులుకోవడంతో రెండు రోజులు నిద్ర పోవడానికికష్టపడ్డానని చెప్పింది. ప్రస్తుతం ఐశ్వర్య.. దర్శకుడు మణిరత్నం నిర్మిస్తున్న వానం కొట్టటం, కార్తీక్‌సుబ్బరాజ్‌ నిర్మిస్తున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా, కా.పే.రణసింగమ్‌ చిత్రాల్లో నటిస్తోంది. అలానే 'వడచెన్నై 2' లో కూడా నటించడానికి అంగీకరించింది.