సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి చాలా కామన్. హీరో, హీరోయిన్లు రిపీటెడ్ గా నటిస్తుంటే వారిపై ప్రేమ, పెళ్లి రూమర్లు చాలానే వినిపిస్తాయి. ఇక ఈ మధ్యకాలంలో నటుడు విజయ్ దేవరకొండపై ఇలాంటి వార్తలు బాగా ఎక్కువయ్యాయి.

ఇప్పటికే అతడికి ఒకరిద్దరు హీరోయిన్లతో లింక్ ఉందని వార్తలు వచ్చాయి. తాజాగా మరో హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడని రూమర్లు వినిపిస్తున్నాయి. ఆమె మరెవరో కాదు.. తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఈ బుటి తమిళంలోనే కాదు.. మలయాళ, హిందీ భాషల్లో కూడా నటించింది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ-క్రాంతి మాధవ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో ఒక హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. అయితే షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య కాస్త కెమిస్ట్రీ కుదిరిందని, ఐశ్వర్య.. విజయ్ తో ప్రేమలో పడిందని వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయంలో ఆమె వరకు వెళ్లడంతో సోషల్ మీడియాలో తన ప్రేమ, పెళ్లి వార్తలపై స్పందించింది.

''నా ప్రేమ కథ గురించి పుకార్లు వింటున్నాను.. దయచేసి ఆ అబ్బాయి ఎవరో చెప్పండి.. తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉన్నాను.. ప్లీజ్'' అంటూ సెటైర్ వేసి.. ఇకనైనా ఇలాంటి అసత్య ప్రచారాలను ఆపండి అంటూ మండిపడింది. నిజంగానే తను ప్రేమలో ఉంటే అందరికీ చెబుతానని.. ప్రస్తుతానికైతే సింగిల్ గా, హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చింది.